
నాగార్జునసాగర్ లో జలవిద్యుత్పత్తిని తెలంగాణ జెన్ కో నిలిపివేసింది. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్ లో విద్యుదుత్పత్తి చేసున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్ యూనిట్లను జెన్ కో ఉత్పత్తి చేసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ జలవిద్యుత్ ను ఉత్పత్తి చేస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేస్తున్నమని తెలంగాణ స్పష్టం చేసింది.