ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమిళనాట పార్టీని స్థాపించారు కమల్ హాసన్. మక్కల్ నీటి మయ్యం పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయిపోయారు. ఇప్పటికే తమిళనాడు ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో.. కమల్ తాజాగా బరిలోకి దిగుతున్నాడు. ఈ రోజు ఇందుకు సంబంధించి నామినేషన్లు సైతం దాఖలు చేశాడు. ఇప్పటికే నటనతో దక్షిణాదికి చేరువైన ఈ యూనివర్సల్ హీరో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి పార్టీ పెట్టి తమిళ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
Also Read: ముఖేష్ అంబానీ కేసులో షాకింగ్ ట్విస్ట్ .. సీసీ టీవీ ఫుటేజ్ మాయం
తమిళనాట పాతుకుపోయిన అన్నాడీఎంకే డీఎంకేలకు తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగాడు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశాడు.
Also Read: పసుపు బోర్డు ఏమైందో అర్వింద్ చెప్పాలి.. జీవన్‌రెడ్డి నిలదీత
అయితే.. కమల్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. తనకు రూ.176.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్థులు రూ.131.84 కోట్లు, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపాడు. లండన్‌లో రూ.2.50 కోట్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉన్నట్టు తెలిపాడు. ఇక తనకు రూ.49.5 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. తాను చదువుకుంది కేవలం 8వ తరగతి వరకేనని సంచలన విషయాన్ని లీక్ చేశాడు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కమల్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే ఈసారి అన్ని పార్టీలను కలుపుకొని తృతీయ ఫ్రంట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Kamal haasan files nomination do you know assets and debts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com