Viral Family Income: ఉద్యోగులయితే.. ప్రభుత్వ విభాగంలో పనిచేసినా.. ప్రవేట్ కంపెనీలలో కొలువులు చేసినా.. ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే.. ఎందుకంటే పన్నుల స్వీకరణ ద్వారా మాత్రమే ప్రభుత్వాలు మనగడ సాగించగలుగుతాయి. ప్రభుత్వాన్ని కొనసాగించగలుగుతాయి. ప్రజలకు సౌకర్యాలు అందించగలుగుతాయి. రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతాయి.. సంపాదించే ఆదాయం ఆధారంగా ప్రభుత్వానికి టాక్స్ లుచెల్లించాల్సి ఉంటుంది. మన దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతోంది కాబట్టి పన్నులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా వివిధ రూపాలలో ఉంటాయి. పన్నులు అధికంగా ఉండడం వల్ల చాలామంది వాటిని తప్పించుకోవడానికి డబ్బును వేరే మార్గంలో దాచిపెడుతుంటారు. దానిని నల్లధనం అని పిలుస్తుంటారు.
Also Read: గుట్కా మరకలకు రూ.4 కోట్ల ఖర్చు.. భారత రైల్వేకు అతిపెద్ద సమస్య!
మన దేశంలో సంపాదనకు అనేక మార్గాలున్నాయి. ఇలా సంపాదించే వారందరూ కూడా టాక్స్ లు చెల్లించడం లేదు. వ్యవస్థీకృత రంగంలో ఉన్నవాళ్లు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ఈ రంగంలో లేనివారు డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ పన్నులు చెల్లించడం లేదు. అలాంటి ఓ కుటుంబానికి సంబంధించిన స్టోరీని ఓ వ్యక్తి బయటపెట్టాడు. అతడు చెప్పిన విషయం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆ వ్యక్తి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. అతని ప్రాంతాన్ని పేర్కొనడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ప్రఖ్యాత సోషల్ మీడియా రెడిఫ్ లో అతడు తన ఇంట్లో పనిచేసే ఓ కుటుంబానికి సంబంధించిన స్టోరీని వెల్లడించాడు. ఆ వ్యక్తి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తుంది.. వంట వండుతుంది. ఇల్లు శుభ్రం చేస్తుంది. దుస్తులు ఉతుకుతుంది. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. ఇందుకుగాను ఆమెకు వారు నెలకు 30,000 ఇస్తారు. ఇక ఆమె భర్త కూలీ పనులకు వెళ్లి నెలకు ఆమె కంటే 5000 ఎక్కువగానే సంపాదిస్తాడు. ఆమె పెద్ద కుమారుడు ఇతర పనులకు వెళ్లి నెలకు 30,000 సంపాదిస్తాడు. ఆమె కుమార్తె టైలరింగ్ పనిచేస్తూ నెలకు 3,000 సంపాదిస్తుంది. చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ నెలకు 15,000 సంపాదిస్తాడు.. మొత్తంగా వారి కుటుంబం ప్రతినెలకు 1,13,000 సంపాదిస్తోందని” ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
నెలకు 1,13,000 సంపాదిస్తున్నప్పటికీ ఆ కుటుంబం ఒక్క పైసా కూడా పన్ను చెల్లించడం లేదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.. ఇలా మన దేశంలో నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నప్పటికీ చాలామంది పన్నులు చెల్లించడం లేదని ఆ వ్యక్తి వాపోయాడు. అంతేకాదు కేవలం ఒక రంగంలో ఉన్నవారు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని.. మిగతా వారి కోసం వారు సంపాదించిన దాంట్లో ప్రభుత్వానికి ఇస్తున్నారని వాపోయాడు. కానీ విదేశాలలో ఇలా ఉండదని.. సంపాదించే ప్రతివారు పన్ను చెల్లిస్తారని అతడు పేర్కొన్నాడు.. మనదేశంలో పన్నుల వ్యవస్థలో చాలా మార్పు రావాలని.. చెల్లించే వారి దగ్గర నుంచే ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయని అతడు వాపోయాడు.
Also Read: పెళ్లయిన రెండు వారాలకే 27 ఏళ్ల నవ వధువు చేతిలో.. దేశంలో మరో దారుణం ఇది..
రెడిఫ్ లో ఆ వ్యక్తి పేర్కొన్న ఈ స్టోరీని చాలామంది లైక్ చేశారు. చాలామంది అతనితో ఏకీభవించారు. కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. “ఇలా ప్రతినెలా రెక్కల కష్టం మీద బతికే వారికి స్థిరమైన ఆదాయం లభించదు. ఒకవేళ మీరు మీ ఇంట్లో నుంచి ఆమెను తొలగిస్తే పని లభించదు. జీతం కూడా లభించదు. అలాంటప్పుడు ఆమెకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది.. వారి కుటుంబం కూడా ఏదో పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. అంత తప్ప వారిని పన్నులు చెల్లించాలి అని చెప్పడం సరైనది కాదని” కొంతమంది నెటిజన్లు అతడికి కౌంటర్ ఇచ్చారు.