Homeఉద్యోగాలుEPF Withdra: పీఎఫ్‌లో కీలక మార్పులు.. ఇక రూ.లక్ష విత్ డ్రా!

EPF Withdra: పీఎఫ్‌లో కీలక మార్పులు.. ఇక రూ.లక్ష విత్ డ్రా!

EPF Withdra: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం సంస్థ కల్పిస్తోంది. వైద్యం, విద్య, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చు కోసం చేసుకునే ఆలో క్లెయిమ్‌ పరిమితిని రెట్టింపు చేసింది.

రూ.లక్ష వరకు విత్‌డ్రా..
ఈపీఎఫ్‌ చందాదారుడుగానీ, అతని కుటుంబం సభ్యుల్లో ఎవరికైనాగానీ వైద్య ఖర్చుల నిమిత్తం నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే అది ఇప్పటి వరకు రూ.50 వేలు ఉండగా, దానిని రూ.లక్షకు పెంచుతూ ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌ జారీ చేసింది. నెల లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. శస్త్ర చికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, గుండె సంబంధ చికిత్సల కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది.

సెల్ఫ్‌ డిక్లరేషన్‌తోనే..
ఇక వైద్య ఖర్చు కోసం విత్‌డ్రా చేసుకునే నగదుకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగి ఆరు నెలల బేసిక్‌ ప్లస్‌ డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా(వడ్డీ సహా) ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version