Horoscope Today: 2024 ఏప్రిల్ 18 గురువారం రోజున ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు అనుకూల ప్రతిఫలాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారికి నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి ఈరోజు ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది.వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో తొందరపడొద్దు.
వృషభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఉద్యోగులు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
మిథునం:
ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయనాయకులు వాదనల వల్ల నష్టపోవచ్చు. ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
కర్కాటకం:
ఏ పని చేసినా ఓపిగ్గా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రాకపోవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.
సింహ:
ఖర్చులను నియంత్రించాలి. కొన్ని రంగాల వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్య:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇష్టమైన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థుల నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల:
కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. అవకాశాలను వినియోగించుకుంటారు. కొన్ని రంగాల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు పురుగతి కనిపిస్తుంది.
వృశ్చికం:
కొత్త పనిని ప్రారంభించే ముందు ఆలోచించాలి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.
ధనస్సు:
బంధుమిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర:
ఉద్యోగులు ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు. సంపద సృష్టించడానికి ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. కోర్టు కేసు పరిష్కారం కావడానికి మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.
మీనం:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు.