దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నవాళ్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం కల్పిస్తోంది మెడికల్ ఎమర్జెన్సీ కింద ఈ డబ్బును తీసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం వల్ల సబ్ స్క్రైబర్లకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రాణాంతకర వ్యాధుల చికిత్స కోసం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ ఖాతా నుంచి ఈ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్ కాస్ట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా ఈ డబ్బులు సులువుగా పొందవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి మెదికల్ ఎమర్జెన్సీకి డబ్బు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయిన తరువాత ఆన్‌లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి క్లెయిమ్ పై క్లిక్ చేయాలి.
ఆ తరువాత అందులో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను వెరిఫై చేసుకోవాలి. ఈపీఎఫ్‌వో నిబంధనలు తెలుసుకొని ప్రోసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌పై క్లిక్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అయితే పీఎఫ్ ఖాతాదారులందరూ ఈ డబ్బును తీసుకోవడానికి అర్హులు కాదు. కేవలం అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఈ డబ్బును తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా డబ్బులు తీసుకునే వాళ్లు కొన్ని షరతులు వర్తిస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వాళ్లకు ఈపీఎఫ్‌వో తీసుకున్న నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు.