https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. గంటలో రూ.లక్ష పొందే ఛాన్స్..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నారనే సంగతి తెలిసిందే. పీఎఫ్ ఖాతా ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పీఎఫ్ సబ్ స్క్రైబర్లకు ఊరట కలగడంతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ లేదా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సమయంలో వెంటనే డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి వ్యయ అంచనాలను అందించాల్సిన పని లేకుండా పీఎఫ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 9, 2021 11:29 am
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నారనే సంగతి తెలిసిందే. పీఎఫ్ ఖాతా ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పీఎఫ్ సబ్ స్క్రైబర్లకు ఊరట కలగడంతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ లేదా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సమయంలో వెంటనే డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

    ఎలాంటి వ్యయ అంచనాలను అందించాల్సిన పని లేకుండా పీఎఫ్ ఖాతాదారులు ఈ డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈపీఎఫ్‌వో జూన్ 1వ తేదీన ఇందుకు సంబంధించిన సర్క్యలర్ ను జారీ చేయడం గమనార్హం. కరోనాతో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల బారిన పడితే చికిత్స కొరకు డబ్బులను ఉపయోగించుకోవచ్చు. గంటలోనే మెడికల్ అడ్వాన్స్ డబ్బులు అందనుండటంతో పీఎఫ్ ఖాతాదారులకు మేలు జరగనుంది.

    ఈపీఎఫ్‌వో గతంలో కూడా సబ్‌స్క్రైబర్లకు మెడికల్ అడ్వాన్స్ ఫెసిలిటీని కల్పించేది. అయితే ఆ సమయంలో కచ్చితంగా వ్యయ అంచనాలను అందించాల్సి ఉండేది. మెడికల్ బిల్లులు సమర్పిస్తే మాత్రమే డబ్బులను పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం మెడికల్ బిల్లులు అవసరం లేకుండానే సులువుగా డబ్బులు పొందవచ్చు. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం ద్వారా పీఎఫ్ ఖాతాదారులు ఈ డబ్బులను పొందవచ్చు.

    మెడికల్ ఎమర్జెన్సీ ఆప్షన్ కింద విత్‌డ్రాయెల్స్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు డిశ్చార్జ్ అయిన తర్వాత 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులను సమర్పించాలి. హాస్పిటల్, పేషంట్ వివరాలు తెలియజేస్తూ రిక్వెస్ట్ లెటర్ ను పంపించాల్సి ఉంటుంది.