Vijayasai Reddy- Sajjala Ramakrishna Reddy: కాంగ్రెస్ డీఎన్ఏగా ప్రచారంలో ఉన్న వైసీపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అధినేతను కలవరపెట్టాయి. ఎన్నడూ లేనంతగా ధిక్కార స్వరాలు కనిపించాయి. పార్టీ అధినేత జగన్ పై అభిమానం ప్రకటిస్తూనే నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కలేదని ఒకరు.. మంత్రి పదవి నుంచి తొలగించారని మరొకరు..కత్తులు దూసుకుంటూ వచ్చారు. దీంతో అధినేత ఓకింత అసహనంతో.. ఇలానే వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై మొదటికే మోసం వస్తుందని గ్రహించారు.
అందుకే అసమ్మతిని కుక్కటి వేళ్లతో పెకిలించేయాలని నిర్ణయానికి వచ్చారు. అటు ప్రభుత్వంతో పాటు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తాజా మాజీలకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. వారిని సమన్వయం చేసుకునే బాధ్యతలు తాను నమ్మిన బంటులకు అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇప్పటి వరకు పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు కేటాయించారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారనే విమర్శలు వచ్చాయి. దీంతో పునఃసమీక్షించిన సీఎం.. సాయిరెడ్డికి బాధ్యతలు పెంచాలని నిర్ణయించారు.దీంతో..మరిన్ని బాధ్యతలు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Somu Veerraju: ‘శక్తి’ని కూడగడుతున్న సోము వీర్రాజు…బీజేపీ బలోపేతానికి పక్కా స్కెచ్
అసంత్రుప్తికి చెక్
గతంలో కేటాయించిన బాధ్యతలకు అదనంగా.. సజ్జలకు కేటాయించిన పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమన్వయ బాధ్యతలను సాయిరెడ్డికి అప్పగించారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భవించక ముందు నుంచే విజయసాయిరెడ్డి జగన్ వెంట నడిచారు. జగన్ వెంట జైలుకెళ్లారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అధినేత ఇచ్చిన టాస్కును ఇట్టే పూర్తిచేసేవారు. పార్టని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర వహించారు. అనుబంధ విభాగాలు, సోషల్ మీడియా విభాగాలను బలోపేతం చేయడం ద్వారా గడిచిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కూడా విజయసాయిరెడ్డికి ప్రాధాన్యమిచ్చారు.
ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. కానీ ఇటీవల పరిణామాలతో విజయసాయిరెడ్డిని పక్కన పడేశారన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై పార్టీలో సైతం భిన్న స్వరాలు వినిపించాయి. కీలక నేతల మధ్య సఖ్యత లేదన్న సంకేతాలు శ్రేణులకు వెళ్లాయి. ఇలాగే కొనసాగితే పార్టీలో విభేదాలు తారాస్థాయికి వెళ్లే ప్రమాదముందని గ్రహించిన అధినేత విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రచారానికి చెక్ చెప్పారు. మరోవైపు సజ్జలకు ప్రాధాన్యం తగ్గకుండాచేశారు. స్వల్ప మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యేలు, మీడియా కో-ఆర్డినేషన్ బాధ్యతను కేటాయించారు. ఇప్పటికే ఎమ్మెల్యేల సమన్వయ బాధ్యతలను సజ్జల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు ఎంపీ విజయసాయి రెడ్డికి, ఇటు సజ్జల రామక్రిష్ణా రెడ్డికి సమ ప్రాధాన్యత ఇచ్చినట్టయ్యింది.
నేటి సమావేశంపై ఆసక్తి
ఇటీవల పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ బుధవారం మంత్రులు, తాజా మాజీలు, ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో నిర్వహించనున్న బేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలో ధిక్కారణ ధోరణులు, అసంత్రుప్తులపై కీలక ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అవసరమైతే తాను కఠిన నిర్ణయాలకు సైతం వెనుకాడబోనని తేల్చిచెప్పడం ద్వారా అసమ్మతివాదులను తన దారిలో తెచ్చుకునే ప్రయత్నంలో సీఎం జగన్ ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. పార్టీలో నేతల మధ్య అనైక్యత- ఆదిపత్య పోరు వంటి అంశాల పైన తన విధానం తేల్చి చెప్పనున్నారు. మే 2వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం పైన దిశా నిర్దేశం చేయనున్నారు. 2024 ఎన్నికలు..ప్రశాంత్ కిషోర్ తో సంబంధాల పైన జగన్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read:Prashant kishor: కాంగ్రెస్ కు ‘హ్యాండ్’ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. గట్టి షాక్
Web Title: Jagan prefers sajjala and vijayasaireddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com