ఎనిమిది చైనా అప్లికేషన్లను నిషేధించిన ట్రంప్

మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా చైనా బిలియనీర్ జాక్ మా యాంట్ గ్రూపునకు చెందిన అలీ పే సహా యాప్ లను నిషేధిస్తూ మంగళవారం సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు 45 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో అమెరికాకు చెందిన ఏ వ్యక్తి అయినా తన లావాదేవీలను ప్రభుత్వానికి లోబడి జరపవలసి ఉంటుంది. వినియోగదారుల డేటాను బదిలీ చేయకుండా నిరోధించేందుకు సిపారసులతో […]

Written By: Suresh, Updated On : January 6, 2021 8:52 am
Follow us on

మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా చైనా బిలియనీర్ జాక్ మా యాంట్ గ్రూపునకు చెందిన అలీ పే సహా యాప్ లను నిషేధిస్తూ మంగళవారం సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు 45 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో అమెరికాకు చెందిన ఏ వ్యక్తి అయినా తన లావాదేవీలను ప్రభుత్వానికి లోబడి జరపవలసి ఉంటుంది. వినియోగదారుల డేటాను బదిలీ చేయకుండా నిరోధించేందుకు సిపారసులతో కూడిన నివేదికను విడుదల చేయాలని వాణిజ్య కార్యదర్శి, అటర్నీ జనరల్, జాతీయ ఇంటెలీజెన్స్ ను ఉత్తర్వల్లో ఆదేశించారు. కాగా నిషేధించిన యాప్ లలో వీ మేట్, వీ చాట్ పే, అలిపే, కామ్ స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్ చాట్, టెన్సెంట్ క్యూ క్యూ ఉన్నాయి. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అప్లికేషన్లను పరిశీలించాలని వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ ను ఆదేశించారు.