
తెలంగాణ రాష్ట్రంలో అక్కడకడ్కగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్రిందస్థాయి తూర్పు గాలులలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం కర్టాటక, గోవా మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. కర్ణాటక తీరం తూర్పు-మధ్య అరేబియన్ నుంచి దక్షిణ కొంకణిలో ఈ ప్రభావం ఉంది. దీని కారణంగా తెలంగాణకు ఆగ్నేయం, దక్షిణ దిశ నుండి గాలులు వీస్తున్నాయి దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురవడంతో పాటు చలికూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా బుధవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.