https://oktelugu.com/

బాలీవుడ్ ‘ఛత్రపతి’గా ఆ హీరో రాణిస్తాడా?

ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. టాలీవుడ్లోని స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బాటలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. బన్నీ నడుస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో చెర్రీ.. ఎన్టీఆర్లు ప్యాన్ ఇండియా స్టార్లుగా మారడం ఖాయంగా కన్పిస్తోంది. బన్నీ తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 12:29 PM IST
    Follow us on


    ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. టాలీవుడ్లోని స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బాటలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. బన్నీ నడుస్తున్నారు.

    ‘ఆర్ఆర్ఆర్’తో చెర్రీ.. ఎన్టీఆర్లు ప్యాన్ ఇండియా స్టార్లుగా మారడం ఖాయంగా కన్పిస్తోంది. బన్నీ తాజాగా నటిస్తున్న ‘పుష్ప’ కూడా ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మాణమవుతోంది. బన్నీకి తెలుగుతోపాటు కోలీవుడ్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే సినిమాలన్నీ కూడా ఇతర భాషల్లో డబ్ అవుతూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నారు.

    Also Read: ఇండస్ట్రీ చూపంతా ప్రభాస్ పైనే.. మూడు సిమాలకే వెయ్యి కోట్లు..!

    వీరిలాగానే బెల్లకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా హిందీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకు హిందీలో మంచి ఆదరణ లభిస్తుండటంతో బాలీవుడ్ నిర్మాతలు అతడితోనే నేరుగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘ఛత్రపతి’ మూవీని బెల్లంకొండ హిందీలో చేయబోతున్నట్లు వార్తలు విన్పించారు.

    తాజాగా ఈ వార్త నిజమేనని తేలింది. బెల్లంకొండ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ముంబైకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అతడితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ‘ఛత్రపతి’గా మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ మూవీకి దర్శకుడిగా వినాయక్ పేరు తాజాగా తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది.

    ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయాలని చాలామంది హీరోలు అనుకున్నప్పటికీ చివరికీ బెల్లంకొండకే ఆ అవకాశం దక్కింది. ఈ మూవీ రీమేక్ విషయంలో తొలుత దర్శకుడు సుజిత్ తెరపైకి వచ్చింది. కాగా వినాయక్ అయితే బెటరని శ్రీనివాస్ భావిస్తుండటంతో తాజాగా అతడి పేరు విన్పిస్తోంది.

    Also Read: డబ్బుల కోసం ఆ పని చేయలేనంటున్న యాంకర్ విష్ణుప్రియ..!

    బెల్లంకొండ నటించిన తొలిచిత్రం ‘అల్లుడు శ్రీను’ కూడా వినాయకే దర్శకత్వం వహించారు. తాజాగా బాలీవుడ్లో శ్రీనివాస్ చేయబోయే తొలి సినిమాకు కూడా వినాయకే దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలతో సతమతవుతున్న వినాయక్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది.

    అయితే రీమేక్ సినిమాలను వినాయక్ చేస్తాడనే నమ్మకం ఉండటంతో శ్రీనివాస్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి స్థాయిలో వినాయక్ బాలీవుడ్ ‘ఛత్రపతి’కి న్యాయం చేస్తాడా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్