పాకిస్థాన్ లో పేలుళ్లు: ఇద్దరి మృతి

పాకిస్థాన్ లో జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందారు.  మరో ఎనిమిది మంది గాయపడ్డారని స్థానిక ఓ అధికారి ఆదివారం తెలిపారు. కాగా గాయపడిన వారి పరిస్థితి విషమంగానే ఉంది. వీరిలో ఓ హైస్కూల్ విద్యార్థి ఉన్నారు. బలుచిస్తాన్ రాష్ట్రం పంజ్ గూర్ జిల్లాలోని ఫుట్‌బాల్ మైదానం సమీపంలో ఈ పేలుడు జరిగింది. అయితే ఫుట్ బాల్ క్రీడలు పూర్తి అయిన తరువాత పేలుడు సంభవించిందని, లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రావిన్షియల్ ప్రతినిధి లియాఖత్ షావానీ […]

Written By: Suresh, Updated On : December 27, 2020 11:39 am
Follow us on

పాకిస్థాన్ లో జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందారు.  మరో ఎనిమిది మంది గాయపడ్డారని స్థానిక ఓ అధికారి ఆదివారం తెలిపారు. కాగా గాయపడిన వారి పరిస్థితి విషమంగానే ఉంది. వీరిలో ఓ హైస్కూల్ విద్యార్థి ఉన్నారు. బలుచిస్తాన్ రాష్ట్రం పంజ్ గూర్ జిల్లాలోని ఫుట్‌బాల్ మైదానం సమీపంలో ఈ పేలుడు జరిగింది. అయితే ఫుట్ బాల్ క్రీడలు పూర్తి అయిన తరువాత పేలుడు సంభవించిందని, లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రావిన్షియల్ ప్రతినిధి లియాఖత్ షావానీ జిన్హువా తెలిపినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విరుద్ధంగా కొందరు పిరికి పందలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని షావానీ అన్నారు.