https://oktelugu.com/

పోలవరానికి కేంద్రం నుంచి వచ్చిందే కట్నమా?

ఎట్టకేలకు కేంద్రం కరుణించింది.. వరాలు కురిపించింది.కానీ మోడీ సర్కార్ వద్ద ఓ పాడు గుణం ఉందంటారు. అంత త్వరగా నిధులను విడుదల చేయరని.. లెక్కలు.. పత్రాలు, కుస్తీ పట్టాకనే విడుదల చేస్తారనే అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే ఏ ప్రాజెక్టుకైనా మోడీ సర్కార్ షెట్టిల మాదిరిగా కొసరికొసరి పైసాను ఇస్తుందని జాతీయ వర్గాల్లో టాక్ ఉంది. Also Read: వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..! ఇప్పుడు తాజాగా కేంద్రం పోలవరంకు పాత అంచనాలతోనే రూ.55 వేల […]

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2020 / 11:29 AM IST
    Follow us on

    ఎట్టకేలకు కేంద్రం కరుణించింది.. వరాలు కురిపించింది.కానీ మోడీ సర్కార్ వద్ద ఓ పాడు గుణం ఉందంటారు. అంత త్వరగా నిధులను విడుదల చేయరని.. లెక్కలు.. పత్రాలు, కుస్తీ పట్టాకనే విడుదల చేస్తారనే అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే ఏ ప్రాజెక్టుకైనా మోడీ సర్కార్ షెట్టిల మాదిరిగా కొసరికొసరి పైసాను ఇస్తుందని జాతీయ వర్గాల్లో టాక్ ఉంది.

    Also Read: వినూత్నం.. లంచం ఇచ్చేందుకు బిక్షాటన చేస్తున్న యువరైతు..!

    ఇప్పుడు తాజాగా కేంద్రం పోలవరంకు పాత అంచనాలతోనే రూ.55 వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని 2017-18 ధరలకే ఖరారు చేసి జగన్ సర్కార్ కు షాకిచ్చింది. ఈ ధరలు చంద్రబాబు నిర్ణయించినవి కావడం విశేషం. కేంద్ర జలశక్తి శాఖ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటిదాకా రూ. 17వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేంద్రం రూపాయి రూపాయి ఇవ్వడానికి చాలా సతాయించింది. ఇప్పుడు రూ. 55వేల కోట్ల ఖర్చు చేయడానికి ఏపీ ప్రభుత్వాన్ని ఎంత విసిగిస్తుందోనని ప్రభుత్వ పెద్దలు కంగారు పడుతున్నారు.

    కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ తాజాగా 2017-18 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి ఓకే చెప్పింది. దీని ప్రకారం ఏపీ ప్రభుత్వానికి రూ. 55వేల 548.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణాజిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నది లక్ష్యమని మంత్రిత్వ శాఖ నివేదికలో తెలిపింది.

    Also Read: రాయలసీమ ఎత్తిపోతలకు లైన్‌ క్లియర్‌‌

    అయితే గతంలో 2013-14 అంచనాల ప్రకారం పోలవరం మొత్తం 20,398 కోట్లు కాగా అప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 3వేల కోట్లు మాత్రమే. ఇప్పుడు 55 వేలు ఇచ్చినా అవి పునరావాసం, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏమాత్రం సరిపోవని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాపోతున్నారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇప్పుడు కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్పితే డిమాండ్ చేసే పరిస్థితిలో జగన్ సర్కార్ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్