https://oktelugu.com/

క్రేజీ అంకుల్స్ ట్రైలర్: శ్రీముఖి గ్లామర్.. దారుణమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్

యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా నటిస్తున్న మొదటి చిత్రం క్రేజీ అంకుల్స్. రాజా రవీంద్ర, భరణి మరియు సింగర్ మను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ.సత్తిబాబు తెరకెక్కిస్తున్నారు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం క్రేజీ అంకుల్స్ ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ఏమిటో స్పష్టత ఇచ్చేశాడు దర్శకుడు. Also Read: […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 11:43 AM IST
    Follow us on


    యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా నటిస్తున్న మొదటి చిత్రం క్రేజీ అంకుల్స్. రాజా రవీంద్ర, భరణి మరియు సింగర్ మను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ.సత్తిబాబు తెరకెక్కిస్తున్నారు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం క్రేజీ అంకుల్స్ ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ఏమిటో స్పష్టత ఇచ్చేశాడు దర్శకుడు.

    Also Read: రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్

    వివిధ కారణాలతో దగ్గరకు రానీయని పెళ్ళాల వలన జీవితంలో శృంగార రసం కోల్పోయిన రాజు, రెడ్డి, రావ్ అనే ముగ్గురు అంకుల్స్… ఫ్రస్ట్రేషన్ తో కూడిన ఫన్నే క్రేజీ అంకుల్స్ కథ అని అర్థం అవుతుంది. మగాడికి కోరిక కలిగితే సహకరించాల్సిన బాధ్యత భార్యదే. అలాంటి భార్య పూజల పేరుతో, బ్యూటీ పేరుతో భర్తను పడక గది సుఖానికి దూరం చేస్తే ఏర్పడే చెడ్డ పరిణామాలు, వాళ్ళు తొక్కే అడ్డదార్లు ఈ మూవీలో దర్శకుడు ఫన్నీగా ప్రస్తావించినట్లు ఉన్నాడు. భార్యల నిర్లక్ష్యానికి గురైన ముగ్గురు అంకుల్స్ కన్ను అపార్ట్మెంట్ లో కి కొత్తగా వచ్చిన శ్రీముఖిపై పడుతుంది.

    Also Read: ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న శృంగార తార ‘షకీలా’ !

    ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న ఆడవాళ్లు అందరూ అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదిస్తారనే ఆలోచన ఉన్న అంకుల్స్ శ్రీముఖి కోసం పడే పాట్లే ఈ చిత్రం. ఈ మూవీలో శ్రీముఖి కొంచెం బోల్డ్ రోల్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె గ్లామర్ షో కూడా అదిరింది. ఫన్ అండ్ రొమాన్స్ తో పాటు చిన్న మెస్సేజ్ కలగలిపి దర్శకుడు క్రేజీ అంకుల్స్ తెరకెక్కించే అవకాశము కలదు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ డోసు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ గా శ్రీముఖి నటిస్తున్న మొదటి చిత్రం, ఆమెకు ఏ స్థాయిలో గుర్తింపు తెస్తుందో చూడాలి. మొత్తంగా ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్