ట్రంప్ కుమారుడికి కరోనా..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈవిషయాన్ని యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈనెల 2న ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు కరోనా సోకింది. ఆ తరువాత ట్రంప్ చికిత్స తీసుకొని కోలుకున్నారు. మెలానియా ట్రంప్ సైతం కోలుకుంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ తన చిన్న కుమారుడు బారన్ యువకుడు అయినందువల్ల ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఆరోగ్యకరమైన […]
Written By:
, Updated On : October 15, 2020 / 08:56 AM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈవిషయాన్ని యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈనెల 2న ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు కరోనా సోకింది. ఆ తరువాత ట్రంప్ చికిత్స తీసుకొని కోలుకున్నారు. మెలానియా ట్రంప్ సైతం కోలుకుంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ తన చిన్న కుమారుడు బారన్ యువకుడు అయినందువల్ల ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే తాను వైరస్ నుంచి కోలుకున్నానని ట్రంప్ తెలిపారు.