జగన్‌ దర్శనం కోసం ఆ ‘పూజారి’ ఆశీర్వాదం తప్పనిసరి..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త విషయం చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేలు ఓ వ్యక్తితో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారట. అదేంటీ సాక్షాత్తూ ఎమ్మెల్యే అయి ఉండి సాధారణ వ్యక్తికి భయపడడమేంటి అని అనుకుంటున్నారా..! అవును ఇప్పుడు అదే జరుగుతోంది.. జగన్‌ తరువాత జగన్‌ అని చెప్పుకునే ఓ వ్యక్తి ప్రజాప్రతినిధులకు, సీఎంకు మధ్య వారధిగా పనిచేస్తున్నాడట. కొందరు వ్యక్తులు ఏదైనా పని కావాలంటే ఎమ్మెల్యేతో కాకపోతే నేరుగా ఆ వ్యక్తిని సంప్రదిస్తున్నారట. దీంతో ఆయన […]

Written By: NARESH, Updated On : October 15, 2020 9:55 am
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త విషయం చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేలు ఓ వ్యక్తితో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారట. అదేంటీ సాక్షాత్తూ ఎమ్మెల్యే అయి ఉండి సాధారణ వ్యక్తికి భయపడడమేంటి అని అనుకుంటున్నారా..! అవును ఇప్పుడు అదే జరుగుతోంది.. జగన్‌ తరువాత జగన్‌ అని చెప్పుకునే ఓ వ్యక్తి ప్రజాప్రతినిధులకు, సీఎంకు మధ్య వారధిగా పనిచేస్తున్నాడట. కొందరు వ్యక్తులు ఏదైనా పని కావాలంటే ఎమ్మెల్యేతో కాకపోతే నేరుగా ఆ వ్యక్తిని సంప్రదిస్తున్నారట. దీంతో ఆయన సైతం అవసరమున్నవారికి చకచకా పనులు చేస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

Also Read: జగన్‌ లేఖ: ప్రశాంత్ భూషణ్‌ రచ్చ చేస్తున్నాడే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ వెళ్లినా.. ఇతర కార్యక్రమాలకు రాష్ట్రం విడిచి వెళ్లినా ఆ వ్యక్తి ఇతర ప్రజాప్రతినిధులపై పెత్తనం చెలాయిస్తాడట. రాష్ట్రంలోని మంత్రులు సైతం జగన్‌తో పనిచేయించుకోవాలంటే ఈ వ్యక్తినే కలుస్తున్నారట. మంత్రులతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ఎమ్మెల్యేలు అనేసరికి చిర్రుబుర్రులాడుతున్నాడట.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు ఆ తరువాత జగన్‌ వెన్నంటే ఉంటున్న ఆయన ప్రభుత్వంలో గానీ.. పార్టీలో గానీ.. లేడు. అంతకుముందు కాంట్రాక్టర్‌ అవతారమెత్తి ఆ తరువాత జగన్‌ ఎన్నికల గెలుపునకు కృషి చేసినట్లు చెప్పుకుంటున్నారు. దీంతో జగన్‌ సైతం కొన్ని విషయాల్లో ఆయన మాట జవదాటనీయడం లేదంటున్నారు.

Also Read: రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలకు ఈ వ్యక్తికి జగన్‌ సాన్నిహిత్యం తెలియక ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారట.ఆ తరువాత విషయం తెలుసుకొని ఇప్పుడు ఏమీ చేయలేక మదనపడుతున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఏవైనా పనులు చేయించుకోవాలంటే ఈ వ్యక్తి ద్వారానే జగన్‌ కలువాలన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏమీ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. పోనీ అప్పుడు తెలియక ఫిర్యాదు చేశామని కొందరు వేడుకున్నా ఆ వ్యక్తి మాత్రం కనికరించడం లేదట. ఇంతకీ ఆ వ్యక్తి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం..