చాలామంది నేతలు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో విజయం సాధించడానికి నానాతంటాలు పడతారు. ప్రజలతోను, ప్రభుత్వ అధికారులతోనూ సామరస్యంగా మెలుగుతారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అవకాశం దొరికితే అధికార జులుం ప్రదర్శించడానికి వెనుకాడరు. తాము చేస్తున్నది తప్పని తెలిసినా ఆ తప్పని తప్పుగా అంగీకరించడానికి వారికి మనసొప్పదు. ప్రభుత్వ అధికారులపై సైతం అజమాయిషీ చలాయించడానికి కొందరు నేతలు వెనుకాడరు.
Also Read : జగన్ తీసుకున్న ఆ నిర్ణయమే నిరుద్యోగుల పాలిట శాపమా…?
తాజాగా తాడికొండ వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏకంగా సర్కిల్ ఇన్ స్పెక్టర్ నే బెదిరిస్తూ వార్తల్లో నిలిచింది. ఏరా అంటూ సీఐని ఎమ్మెల్యే సంబోధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన ఉండవల్లి శ్రీదేవి తాజాగా ఈ వివాదం ద్వారా మరోమారు వార్తల్లో నిలిచారు. సీఐ అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకోవడంతో శ్రీదేవి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఫోన్ కాల్ సంభాషణలోని సీఐకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సీఐ ఫోన్ కాల్ లో అక్రమంగా మట్టిని తరలించడం జగన్ సర్కార్ పాలసీకి వ్యతిరేకమని చెప్పినా తన మాటంటే లెక్క లేదా…? అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నా కాళ్లు పట్టుకుని ఉద్యోగం తెచ్చుకున్నావని… ఎక్స్ట్రాలు చేస్తే ఎస్పీకి, డీజీపీకి చెబుతానంటూ శ్రీదేవి సీఐని బెదిరించింది.
నీకేమైనా మెంటలా…? ఎమ్మెల్యే మాటంటే రెస్పెక్ట్ లేదా…? అని శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఉండవల్లి శ్రీదేవి తనను మోసం చేసిందని వైసీపీ నేత రవి సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి విదితమే. తనకు శ్రీదేవి అప్పుగా తీసుకున్న 80 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రవి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే శ్రీదేవి మాత్రం కొందరు తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతుండటం గమనార్హం.
Also Read : వాళ్లు దరిద్రులంటూ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..?