https://oktelugu.com/

ఎన్టీఆర్‌‌ జిల్లాలో వైఎస్‌ఆర్‌‌ మున్సిపాల్టీ ఏంటి..? : పెదవి విరుస్తున్న ప్రజలు

ప్రజల అభిప్రాయాలతో పనిలేకుండా జగన్‌ సర్కార్‌‌ దూకుడుగా దూసుకెళ్తోంది. ఏపీ సర్కార్‌‌ ఒకవిధంగా వింత నిర్ణయాలు తీసుకుంటోంది. తాము చెప్పిందే వేదం.. తాము చేసిందే శాసనం అన్నట్లు నడుస్తోంది. తాజాగా విజయవాడను ఆనుకుని ఉండే తాడిగడపను ప్రత్యేక మున్సిపాల్టీగా ఏర్పాటు చేసేసింది. చుట్టుపక్కల గ్రామాలను కలిపేసి.. మున్సిపాల్టీ చేసేసింది. Also Read: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..: జగన్‌ వైఖరి అలానే ఉందట అయితే.. ఇప్పటివరకూ వారంతా తాము విజయవాడలో భాగమని అనుకుంటున్నారు. గ్రేటర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2021 1:24 pm
    Follow us on

    NTR Dist
    ప్రజల అభిప్రాయాలతో పనిలేకుండా జగన్‌ సర్కార్‌‌ దూకుడుగా దూసుకెళ్తోంది. ఏపీ సర్కార్‌‌ ఒకవిధంగా వింత నిర్ణయాలు తీసుకుంటోంది. తాము చెప్పిందే వేదం.. తాము చేసిందే శాసనం అన్నట్లు నడుస్తోంది. తాజాగా విజయవాడను ఆనుకుని ఉండే తాడిగడపను ప్రత్యేక మున్సిపాల్టీగా ఏర్పాటు చేసేసింది. చుట్టుపక్కల గ్రామాలను కలిపేసి.. మున్సిపాల్టీ చేసేసింది.

    Also Read: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..: జగన్‌ వైఖరి అలానే ఉందట

    అయితే.. ఇప్పటివరకూ వారంతా తాము విజయవాడలో భాగమని అనుకుంటున్నారు. గ్రేటర్ విజయవాడలో మార్చేసి తమను కలిపేస్తారని గట్టిగా నమ్ముతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తాటిగడప అనే మున్సిపాల్టీని ఏర్పాటుచేసేసింది. అదే వివాదం అనుకుంటే.. ప్రభుత్వ పథకాలకు పెట్టినట్లుగా ఊరికి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టేసింది. వైఎస్ఆర్ తాటిగడప అనే పేరుతో మున్సిపాల్టీని ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి ప్రజలు అవాక్కయ్యారు. వైఎస్ఆర్‌కు తాటిగడపకు సంబంధం ఏంటని చర్చించుకుంటున్నారట.

    విజయవాడ నగర శివారు ప్రాంతాలంటే కామన్‌గా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే వర్గాలే ఎక్కువ. అయితే.. వారికి చెక్ పెట్టాలంటే ప్రత్యేక మున్సిపాల్టీ ఉండాల్సిందేనని.. అదీకూడా వైఎస్ఆర్ పేరుతో పెట్టాల్సిందేనని నిర్ణయించుకునే ఈ మేరకు అమలు చేసేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరు కూడా అక్కడి ప్రజలు నోరెత్తలేరు. ఎత్తితే కేసులు పేరుతో తీసుకెళ్లి లాకప్‌లో వేస్తారు. అందుకే.. ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి నవ్వుతోనే సమాధానం చెబుతున్నారు.

    Also Read: ఆ ఎమ్మెల్యేకు జగన్ క్లాస్‌..: మళ్లీ రిపీట్‌ కావద్దని ఆర్డర్‌‌

    గతంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ.. కృష్ణా జిల్లాలోని ఓ మున్సిపాల్టీని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ పేరు మాత్రం పెట్టడం చర్చకు దారితీసింది. త్వరలో కృష్ణా జిల్లా పేరు మారిస్తే.. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ మున్సిపాల్టీ ఉన్నట్టే అవుతుంది. నిజానికి ఊళ్ల పేర్లకు చారిత్రక నేపథ్యాలుంటాయి. వాటితో ప్రజలకు సెంటిమెంట్‌ ఉంటుంది. ఇలా మార్పు చేయడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నామకరణం చేయాల్సి ఉన్నా.. జగన్‌ మాత్రం ఇలా వైఎస్‌ఆర్‌‌ పేరు పెట్టడంపై ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేక పెంచుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్