ఏపీలో ఆలయాలపై దాడులు ఎంతలా రాజకీయ దుమారం రేపుతున్నాయో అందరికీ తెలుసు. రోజుకో ఆలయంపై దాడులు చూస్తూనే ఉన్నాం. కానీ.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’గా ఉంది జగన్ వైఖరి. ఇన్ని రోజులు స్పందించని జగన్ ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. స్పందించే టైమ్‌లో స్పందించకుండా నష్టం జరిగిపోయాక స్పందిస్తే ఏం లాభం అనేసి నెటిజన్లు అంటున్నారు. ఫస్ట్ ఆలయం మీద దాడి జరిగినప్పుడే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే.. ఇన్ని రిపీట్ అయ్యేవి కావు కదా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ టైమింగ్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.
Also Read: ఆ ఎమ్మెల్యేకు జగన్ క్లాస్..: మళ్లీ రిపీట్ కావద్దని ఆర్డర్
ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సీఎం జగన్ భీకరంగా స్పందిస్తున్నారు. ఎవరినీ వదలొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంకా చాలా చాలానే చెబుతున్నారు. అవన్నీ ఇంకా సీరియస్‌గా ఉన్నాయి. కానీ.. పరిస్థితి చూస్తే ఇప్పటికే చేయిదాటిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం అయిపోయింది. ఒక్కో పార్టీ రంగంలోకి దిగుతోంది. ఆలయాల అంశం అత్యంత సున్నితమైనదని.. రాజకీయ ప్రాధాన్యత కలదని తెలియని రాజకీయ నేత ఉండరు. జగన్‌కు కూడా ఈ విషయం మరింత స్పష్టత ఉంటుంది. అయితే.. ఆయన ఏం చేశారు..?
తన హయాంలో.. ఇలాంటివి జరిగితే.. మరింత ఎక్కువ ప్రచారం వస్తుందని కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే.. ఆయన క్రిస్టియన్. ఆ విషయంలో ఎవరికీ పట్టింపు లేదు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. అయితే క్రిస్టియన్ సీఎం స్థానంలో ఉన్నప్పుడు మత రాజకీయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఆయన గుర్తించాల్సి ఉంది. కానీ.. మొదటి నుంచి ఆలయాలపై దాడుల వ్యవహారాంలో నిర్లక్ష్యమే కనిప్తోంది. వ్యక్తిగతంగా కేర్ తీసుకుని.. ఆలయాలకు రక్షణ వ్యవహారాలు చూడాల్సింది. కానీ.. వాటి గురించి తాము పట్టించుకోవాల్సిందేమున్నట్లుగా ఉన్నారు. ఫలితంగా దాడులు అంతకంతకూ పెరిగిపోయాయి.
Also Read: బ్రేకింగ్: కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. భూమా అఖిలప్రియ అరెస్ట్
బిట్ర గుంటనుంచి రామతీర్థం వరకు జరిగిన ఘటనలకు లెక్కేలేదు. కానీ.. ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదు. చాలా వరకూ మతి స్థితిమితం లేని వారి పనే అన్నట్లు చెప్పుకొచ్చారు. మరికొన్ని వాటికవే పడిపోయాయనని చెప్పారు. ఇక రామతీర్థం విషయంలోనూ అదే చేయబోయారు. మొదట మతిస్థిమితం లేని వారి పని అన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు సీఐడీ పోలీసులు వచ్చి పక్కా కుట్ర ప్రకారం జరిగిందనే వాదన వినిపిస్తున్నారు. ఆ విషయం మొదట్లో ఎందుకు గుర్తించలేకపోయారనే విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. మొదట్లో లైట్ తీసుకోవడంతో ఇప్పుడు అది పెద్ద సమస్యగా తయారైంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్