https://oktelugu.com/

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టు ఇదే?

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత టీం సిద్ధమైంది. సిడ్నీ వేదికగా రేపటి నుంచి జరుగనున్న ఈ మూడో టెస్టుకు తుదిజట్టును టీమిండియా ప్రకటించింది. Also Read: ఆస్ట్రేలియా vs ఇండియా: సిడ్నీ టెస్టుకు పొంచి ఉన్న ముప్పు? అందరూ ఊహించినట్టే రోహిత్ శర్మ తిరిగి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఓపెనర్ గా రంగంలోకి దిగుతున్నాడు. శుభమన్ గిల్ తో కలిసి అతడు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. ఇక అనుకున్నట్టే గత మ్యాచుల్లో నిరాశపరిచిన ఓపెనర్ […]

Written By: , Updated On : January 6, 2021 / 01:35 PM IST
Follow us on

India vs Australia 3rd test

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత టీం సిద్ధమైంది. సిడ్నీ వేదికగా రేపటి నుంచి జరుగనున్న ఈ మూడో టెస్టుకు తుదిజట్టును టీమిండియా ప్రకటించింది.

Also Read: ఆస్ట్రేలియా vs ఇండియా: సిడ్నీ టెస్టుకు పొంచి ఉన్న ముప్పు?

అందరూ ఊహించినట్టే రోహిత్ శర్మ తిరిగి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఓపెనర్ గా రంగంలోకి దిగుతున్నాడు. శుభమన్ గిల్ తో కలిసి అతడు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు.

ఇక అనుకున్నట్టే గత మ్యాచుల్లో నిరాశపరిచిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఈసారి మూడో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఇక మూడో బౌలర్ ఎవరిని తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్తానంలో యువ పేసర్ నవదీప్ సైనికి తుదిజట్టులో స్థానం దక్కింది. ఈ మ్యాచ్ తోనే సైని టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.

Also Read: గాయాల బెడద.. 3వ టెస్టుకు టీమిండియా టీం ఇదే?

నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియాలు చెరో విజయం సాధించి ఊపు మీదున్నాయి. ఈ మూడో టెస్టు కీలకంగా మారింది.