ఖమ్మం నుంచే షర్మిల తొలి అడుగు..

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని డిసైడయిన వైఎస్. షర్మిల రాష్ట్రంలోని జిల్లలో పర్యటించేందుకు షెడ్యూలు ఖరారు చేసుకున్నారు. ఖమ్మం నుంచి తన యాత్రను ప్రారంభించబోతున్నారు. రెండు రోజులుగా ఖమ్మం జిల్లా అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అందులో ఈనెల 21న ఖమ్మం వైఎస్సార్సీపీ అభిమానులతో సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. Also Read: కేసీఆర్-ఓవైసీ దోస్తీ ‘గ్రేటర్’లో బయటపడింది లోటస్ పాండ్ నుంచి 21న ఉదయం భారీ కాన్వయ్ తో ఖమ్మం వెళ్లి.. గిరిజనుల పోడు భూముల కోసం పోరాటం […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 2:50 pm
Follow us on


తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని డిసైడయిన వైఎస్. షర్మిల రాష్ట్రంలోని జిల్లలో పర్యటించేందుకు షెడ్యూలు ఖరారు చేసుకున్నారు. ఖమ్మం నుంచి తన యాత్రను ప్రారంభించబోతున్నారు. రెండు రోజులుగా ఖమ్మం జిల్లా అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అందులో ఈనెల 21న ఖమ్మం వైఎస్సార్సీపీ అభిమానులతో సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read: కేసీఆర్-ఓవైసీ దోస్తీ ‘గ్రేటర్’లో బయటపడింది

లోటస్ పాండ్ నుంచి 21న ఉదయం భారీ కాన్వయ్ తో ఖమ్మం వెళ్లి.. గిరిజనుల పోడు భూముల కోసం పోరాటం చేయనున్నారు.పోడు భూముల్లో పట్టాలే ఎజెండాగా సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి గిరిజనులు కూడా రావాలని ఇప్పటికే దిశా.. నిర్దేశనం చేశారు. గిరిజనుల్లో అత్యధికులు కన్వర్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు పెరుగుతున్న పరిస్థితుల కారణంగా స్కూల్ కూడా దాటని పరిస్థితిలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు.

Also Read: రాజ‌కీయాల్లోకి అన‌సూయ‌.. ఏ పార్టీలో చేర‌బోతోంది?

అలాంటివారిని గుర్తించేందుకు క్రైస్తవ మిషనరీలు ఎప్పుడో పని ప్రారంభించాయి. వైఎస్సార్ సీపీ పార్టీకి కొన్ని గిరిజన ప్రాంతాల్లో విపరీతమైన ఓటింగ్ ఉటుంది. దానికి కారణగా మత మర్పిడిలేనని రాజకీయంగా అందరూ ఒప్పుకునే అంశం. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కూడా ఈ గిరిజనులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకే మొదటగా.. షర్మిల గిరిజన ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అదే సమయంలో షర్మిల పార్టీ విషయంలో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. కడప జిల్లాతో వియ్యం అందుకున్న ఆ వ్యక్తి.. ఒకప్పుడు.. వైసీపీతోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్య పోడు భూములు. వాటికి పట్టాల కోసం గిరిజనులు కొట్లాడుతున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గిరిజనులను హక్కుదారులుగా కల్పిస్తూ.. పట్టాలిచ్చారు. ప్రస్తుతం అవి వివాదంలో ఉన్నాయి. అయినప్పటికీ.. రాజన్న రాజ్యంలో ఇచ్చిన విధంగానే పోడు భూముల్లో పట్టాలు దక్కాలంటే.. మళ్లీ అదే రాజ్యం రావాలని గిరిజనులతో చెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి షర్మిల తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నారు.