https://oktelugu.com/

హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం.. రాష్ట్రపతికి మహిళ రాసిన లేఖ వైరల్..!

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ రాష్ట్రపతికి రాసిన లేఖ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళ రాష్ట్రపతిని హెలికాఫ్టర్ కొనుక్కోవడం కోసం రుణం కావాలని లేఖలో పేర్కొంది. సదరు మహిళ ఇలా రుణం అడగడానికి ముఖ్యమైన కారణమే ఉంది. మహిళ నివశించే గ్రామంలోని అధికారుల నిర్లక్ష్యాన్ని రాష్ట్రపతికి తెలియజేయాలనే ఉద్దేశంతో మహిళ హెలికాఫ్టర్ ను కొనుగోలు చేయడానికి రుణం కోరింది. Also Read: ఏటీఎంను ముట్టుకోకుండా డబ్బులు విత్ డ్రా.. ఎలా అంటే..? పూర్తి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 12, 2021 / 02:51 PM IST
    Follow us on

    మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ రాష్ట్రపతికి రాసిన లేఖ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళ రాష్ట్రపతిని హెలికాఫ్టర్ కొనుక్కోవడం కోసం రుణం కావాలని లేఖలో పేర్కొంది. సదరు మహిళ ఇలా రుణం అడగడానికి ముఖ్యమైన కారణమే ఉంది. మహిళ నివశించే గ్రామంలోని అధికారుల నిర్లక్ష్యాన్ని రాష్ట్రపతికి తెలియజేయాలనే ఉద్దేశంతో మహిళ హెలికాఫ్టర్ ను కొనుగోలు చేయడానికి రుణం కోరింది.

    Also Read: ఏటీఎంను ముట్టుకోకుండా డబ్బులు విత్ డ్రా.. ఎలా అంటే..?

    పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్‌సౌర్ జిల్లా బర్ఖేడా గ్రామంలో బసంతి రాయి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆ మహిళ పొలానికి సరిహద్దుల్లో మరో పొలం ఉంది. మరో పొలం యజమాని దారిని మూసివేయడం వల్ల మహిళకు పొలానికి చేరుకునే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్రామంలోని అధికారులతో పాటు స్థానిక జిల్లా అధికారులకు కూడా మహిళ ఈ విషయాన్ని తెలియజేసింది.

    Also Read: రివ్యూ : ఉప్పెన : ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ స్టోరీ !

    అయితే అధికారులు ఆ మహిళ చేసిన ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు మహిళ సమస్యకు పరిష్కారం చూపించలేదు. బసంతి బాయి బంధువులలో ఒకరు లేఖ గురించి మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మహిళ రాష్ట్రపతికి లేఖ రాయాలని భావించిందని.. ఒక టైపిస్ట్ సహాయంతో లేఖ రాసి.. తన సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు బుద్ధి వచ్చేలా చేసిందని తెలిపారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖ ఇంకా రాష్ట్రపతికి చేరలేదని తెలుస్తోంది.