https://oktelugu.com/

సుధాక‌ర్ ఇక్క‌డ‌ క‌మెడియ‌న్‌.. అక్క‌డ స్టార్ హీరో.. మీకు తెలుసా..?

‘పిచ్చ‌కొట్టుడు సుధాక‌ర్‌..’ కామెడీకి సరికొత్త అర్థం చెప్పిన నటుడు. తనదైన డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ తో సాగిపోయే ఆయ‌న న‌ట‌న చూస్తే ఎవ్వ‌రైనా పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వాల్సిందే. పాత త‌రం చిత్రాలు మొద‌లు.. ఇప్ప‌టి స్టార్ హీరోల‌తోనూ క‌లిసి న‌టించాడు సుధాక‌ర్‌. అయితే.. 2010లో తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన ఆయ‌న ఆ త‌ర్వాత కోలుకున్నారు. అయితే.. ఒక క‌మెడియ‌న్ గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన సుధాక‌ర్‌.. మెగాస్టార్ తో కలిసి నటనలో అక్షరాలు నేర్చుకున్నాడని […]

Written By:
  • Rocky
  • , Updated On : February 12, 2021 / 02:19 PM IST
    Follow us on


    ‘పిచ్చ‌కొట్టుడు సుధాక‌ర్‌..’ కామెడీకి సరికొత్త అర్థం చెప్పిన నటుడు. తనదైన డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ తో సాగిపోయే ఆయ‌న న‌ట‌న చూస్తే ఎవ్వ‌రైనా పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వాల్సిందే. పాత త‌రం చిత్రాలు మొద‌లు.. ఇప్ప‌టి స్టార్ హీరోల‌తోనూ క‌లిసి న‌టించాడు సుధాక‌ర్‌. అయితే.. 2010లో తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన ఆయ‌న ఆ త‌ర్వాత కోలుకున్నారు. అయితే.. ఒక క‌మెడియ‌న్ గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన సుధాక‌ర్‌.. మెగాస్టార్ తో కలిసి నటనలో అక్షరాలు నేర్చుకున్నాడని మీకు తెలుసా? అంతేకాదు.. చిరంజీవికన్నా ముందు స్టార్ హీరో అన్న సంగ‌తి మీలో ఎంత మందికి తెలుసు?

    Also Read: రాజ‌శేఖ‌ర్ జీవితం గురించి.. మీకు తెలియ‌ని ఎన్నో నిజాలు!

    సుధాక‌ర్ ఉమ్మ‌డి ఏపీలోని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గ్రామంలో 1956 ఫిబ్రవరి 1న‌ జన్మించారు. సుధాకర్ తండ్రిగారు రత్నం. ఈయన ఓ డిప్యూటీ కలెక్టర్. తల్లి పేరు కటాక్షమ్మ. వీరికి మొత్తం ఏడుగురు మగ సంతానం. విద్యాభ్యాసం పూర్త‌యిన త‌ర్వాత‌.. సినిమాల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు సుధాక‌ర్‌. అప్పుడు సినిమా ఇండ‌స్ట్రీ మ‌ద్రాసు కేంద్రంగా ఉండేది. ఆ విధంగా అక్క‌డికి వెళ్లిన సుధాక‌ర్‌.. అప్పుడే సినిమా ఛాన్సుల కోసం తిరుగుతున్న చిరంజీవి, హరి ప్రసాద్, నారాయణరావు లతో కలిసి ఒకే గదిలో ఉండేవారు.

    ఈ క్ర‌మంలో దర్శకుడు భారతీరాజాను కలవడంతో ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే సినిమాలో సుధాకర్ కు ఛాన్స్ వచ్చింది. ఈ భారీ సినిమా విజయం సాధించింది. దీంతో వెనుదిరిగి చూసుకోలేదు సుధాకర్. స్టార్ హీరోగా మారిపోయారు. అలా దాదాపు 45 తమిళ సినిమాల్లో నటించారు. ఆ విధంగా చిరంజీవి కంటే ముందుగానే తమిళంలో హీరోగా సినిమా చేశారు. సుధాకర్ నటించిన సినిమాల్లో దాదాపు 18 సినిమాల్లో హీరోయిన్ రాధిక కావడం విశేషం. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చేయడం.. మద్రాసులో రాజకీయాల్లో వచ్చిన మార్పులు వంటి కారణాలతో తమిళ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు సుధాకర్. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు.

    Also Read: రివ్యూ : ఉప్పెన : ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ స్టోరీ !

    తెలుగులో కమెడియన్ గానే ప్రసిద్ధి చెందారు సుధాకర్. ఆయన కామెడీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సుధాకర్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారారు. ఆయన పలు చిత్రాలను నిర్మించారు. చిరంజీవితో కలిసి ‘యముడికి మొగుడు’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. సుధాకర్ తోపాటు స్నేహితులు కలిసి ఆ సినిమాను నిర్మించారు. ఇంకా టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు తీశాడు.

    అయితే.. 2010లో ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. 2015 సంవత్సరంలో ఆయన తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నటించబోతున్నట్టు ప్రకటించారు. కానీ.. పెద్దగా కనిపించలేదు. మొత్తానికి.. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాత సినీ రంగానికి ఆయన విశేష సేవ చేశారు. ఈ క్రమంలో ఆస్తులను బాగానే కూడబెట్టారని టాలీవుడ్ టాక్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సుధాకర్ కోమలో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు నారాయణరావు, చిరంజీవి కుటుంబాని అండగా ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు. మ‌రి, భ‌విష్య‌త్ లో సినిమాల్లోకి వ‌స్తారా? లేదా? అనేదిచూడాలి.