https://oktelugu.com/

CM YS Jagan: ఆ కేసులో జ‌గ‌న్‌కు రిలీఫ్.. కానీ ఇదేం తీరు..

CM YS Jagan: జ‌గ‌న్ అంటే అంద‌రికీ ముందుగా గుర్తు వ‌చ్చేది కోర్టు కేసులే. ఎందుకంటే ఏ రాజ‌కీయ నేత‌కు లేనన్ని కేసుల గొడ‌వ‌లు జ‌గ‌న్ ఉన్నాయేమో అనిపిస్తుంది. సీఎం అయిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కు కోర్టు కేసుల టెన్ష‌న్ వ‌ద‌ల‌ట్లేదు. కాగా 2014లో జ‌గ‌న్ మీద ఓ కేసు న‌మోదైంది. అప్ప‌ట్లో తెలంగాణ‌లోని హుజూర్ న‌గ‌ర్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌గ‌న్ రోడ్ షో చేశారనే కేసు ఇప్ప‌టికీ న‌డుస్తోంది. మొద‌ట్లో ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 29, 2022 / 04:53 PM IST
    Follow us on

    CM YS Jagan: జ‌గ‌న్ అంటే అంద‌రికీ ముందుగా గుర్తు వ‌చ్చేది కోర్టు కేసులే. ఎందుకంటే ఏ రాజ‌కీయ నేత‌కు లేనన్ని కేసుల గొడ‌వ‌లు జ‌గ‌న్ ఉన్నాయేమో అనిపిస్తుంది. సీఎం అయిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కు కోర్టు కేసుల టెన్ష‌న్ వ‌ద‌ల‌ట్లేదు. కాగా 2014లో జ‌గ‌న్ మీద ఓ కేసు న‌మోదైంది. అప్ప‌ట్లో తెలంగాణ‌లోని హుజూర్ న‌గ‌ర్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌గ‌న్ రోడ్ షో చేశారనే కేసు ఇప్ప‌టికీ న‌డుస్తోంది.

    CM YS Jagan

    మొద‌ట్లో ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టుకు చేరుకుంది. కాగా ఈ కేసు విచార‌ణ‌కు మార్చి 28న హాజ‌రు కావాలంటూ జగన్ కు కోర్టు సమన్లు పంపించింది. ఇక్క‌డే జ‌గ‌న్ ఓ మెలిక పెట్టుకున్నారు. త‌న‌కు నిర్ణీత టైమ్ లో ఆ స‌మ‌న్లు చేర‌లేద‌ని, కాబ‌ట్టి మ‌రోసారి స‌మ‌న్లు పంపాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు వినిపించారు.

    Also Read: KCR- China Jeeyar Swamy: సమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు.. షాకింగ్ ఆదేశాలిచ్చి చినజీయర్ కు షాకిచ్చిన కేసీఆర్

    ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కు మ‌రోసారి స‌మ‌న్లు పంపించింది న్యాయ‌స్థానం. ఈ స‌మ‌న్లు పంప‌డంపై జ‌గ‌న్ తెలంగాణ కోర్టునుఆశ్రయించారు. అస‌లు ఈ కేసును కొట్టేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఏప్రిల్ 30 దాకా నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు కాకుండా స్టే ఇచ్చేసింది. ఆ తర్వాత హైకోర్టులో దీని మీద విచారణ జ‌ర‌ప‌నుంది.

    అస‌లు ఇందులో జ‌గ‌న్ చేసిందేంటి.. తాను త‌ప్పు చేయ‌లేద‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం చేయ‌కుండా.. తీర్పుల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జ‌గ‌న్‌.. వాటి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు త‌ప్ప‌.. తాను అస‌లు త‌ప్పు చేయ‌లేద‌నే వాద‌న‌ను మాత్రం బ‌లంగా వినిపించ‌లేక‌పోతున్నారు.

    CM YS Jagan

    ఆ కేసుల‌తో పోలిస్తే.. ఈ ఉల్లంఘ‌న కేసు పెద్ద‌దేం కాదు. కానీ దీని నుంచి కూడా జ‌గ‌న్ త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డమే ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది. ఒక ఉన్న‌త‌మైన సీఎం స్థాయిలో ఉన్న వ్య‌క్తి.. న్యాయ‌స్థానాల‌ను గౌర‌వించాలి గానీ.. ఈ కోర్టులో తీర్పు రాలేద‌ని మ‌రో కోర్టులో పిటిష‌న్లు వేసుకుంటూ పోవ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

    Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?

    Tags