Janasena Party: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీల్లోకి వలసలు పెరగనున్నాయి. వైసీపీ తీరుతో నేతలు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. అయితే జనసేన లేదంటే టీడీపీకి వెళ్లేందుకు ప్రయత్నాలుముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అసంతృప్తులు పార్టీలు మారేందుకు మొగ్గు చూపుతున్నారు.
వైసీపీ నిర్ణయాలు కూడా గుదిబండలా మారుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్టీ చేపడుతున్న విధానాలు ప్రజలకు, నాయకులకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు మూడు రాజధానుల విషయంలో కూడా వైసీపీ విధానం అసంబద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీ నేతల్లో అసంతృప్తి రగులుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
ఇదే సందర్భంలో ప్రస్తుతం అందరికి జనసేన పార్టీ మంచి సిద్ధాంతాలు ఉన్న పార్టీగా కనిపిస్తోంది. అందుకే అందులో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పవన్ కల్యాణ్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో కొత్తపల్లి సుబ్బారాయుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ ఇస్తుందని అందరిలో ఆలోచన పెరుగుతోంది.
టీడీపీలో చేరినా నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకు వయసైపోతోంది. లోకేష్ కు అంత సీన్ లేదనే వాదన వస్తోంది. దీంతోనే జనసేనలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో జనసేన తన ప్రభావం చూపి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనే భావన అందరిలో ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే జనసేన వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనే ఉద్దేశంలో నేతలు ఉన్నారు. దీంతోనే జనసేనలో చేరాలని భావిస్తున్నారు. టీడీపీ పాలన చూశారు. వైసీపీ ప్రభుత్వ తీరు పరిశీలించారు. ఇక జనసేన పార్టీ ఒకటే మిగిలింది దీని పాలన కూడా చూసేందుకు ఓటర్లు రెడీ అవుతున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన మరింత విస్తరించి తన ప్రభావాన్ని చూపెడుతుందని ఓటర్లు ఆశిస్తున్నారు.
Also Read: BJP Bandi Sanjay: ‘పాతబస్తీ’పై బీజేపీ వార్.. ఇరుకునపడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్?