అయితే పక్కనే ఉన్న తెలంగాణలో(Telangana) మాత్రం నాయకులకు ఏ సమస్యలు లేవు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏపీలో పరిస్థితి మరోలా ఉంది. రోజురోజు భారంగా మారుతోంది. అధికారం ఉన్నా తమకు అనువైన కాలం రావడం లేదని చెబుతున్నారు. దీంతో ఎన్నికలు త్వరగా వస్తేనే బాధలకు విముక్తి కలుగుతుందని భావిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో భవిష్యత్ పై భయం పట్టుకుంది.
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పినా అది ఆచరణలో కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అది కూడా నెరవేరడం లేదు. దీంతో జగన్ ఆలోచనలో పడిపోయారు. ఇచ్చిన మాట తీర్చలేకపోతున్నందుకు మనసులో కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీలు తీర్చలేకపోయిన పదవి ఎందుకు అనే బాధలో పడిపోయినట్లు సమాచారం.
జగన్ పై నెమ్మదిగా వస్తున్న వ్యతిరేకత ఇలాగే వస్తే వచ్చే రెండున్నరేళ్లలో పూర్తి స్థాయిలో వస్తుందని టీడీపీ భావిస్తోంది. దీంతో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని టీడీపీ ఆలోచన. అందుకే ఎన్నికలు ఎంత ఆలస్యమైనా ఫరవాలేదనే ధోరణిలో టీడీపీ ఎదురు చూస్తోంది. జగన్ మాత్రం ప్రభుత్వ నిర్వహణ కష్టసాధ్యంగా మారే ప్రమాదం ఉన్నందున త్వరగా ఎన్నికలు వస్తే బాగుండు అనే ఆలోచనలో పడిపోయినట్లు చెబుతున్నారు.
2021 సంవత్సరం జగన్ కు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. అప్పుల భారం పెరిగిపోతోంది. హామీలు నెరవేర్చేందుకు నిధుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2024 వస్తే బాగుండు అని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మాత్రం ఎన్నికలు ఆలస్యమైనా మంచిదే కానీ అధికార పార్టీ వైసీపీకి మాత్రం వ్యతిరేకత మాకు లాభిస్తోందని భావిస్తోంది.