Taliban warns US: అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక

Taliban warns US: అఫ్గనిస్తాన్ (Afghanistan) లో తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా(US) భావించిన తరుణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban) తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 31 నాటికి అమెరికా తన బలగాలను వెనక్కి రప్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. దీంతో యావత్ ప్రపంచం దీనిపై ఆందోళన చెందుతోంది. అమెరికా తీరు ఏంటని ఆలోచనలో పడిపోయాయి. అఫ్గానిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ […]

Written By: Srinivas, Updated On : August 24, 2021 9:46 am
Follow us on

Taliban warns US: అఫ్గనిస్తాన్ (Afghanistan) లో తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా(US) భావించిన తరుణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban) తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 31 నాటికి అమెరికా తన బలగాలను వెనక్కి రప్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. దీంతో యావత్ ప్రపంచం దీనిపై ఆందోళన చెందుతోంది. అమెరికా తీరు ఏంటని ఆలోచనలో పడిపోయాయి.

అఫ్గానిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లడంతో తాలిబన్లు తక్కువ సమయంలనే దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాబుల్ ఎయిర్ పోర్టులో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రతి విమానం వెనుక పరుగులు పెడుతూ తమ ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్న దృశ్యాలు మన కళ్లకు కడుతున్నాయి. ప్రస్తుతం కాబుల్ ఎయిర్ పోర్టు 5800 అమెరికా సైనికుల పహారాలో ఉంది.

ఆగస్టు 31 నాటికి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకున్న క్రమంలో బలగాలను పూర్తిస్థాయిలో తరలించడం ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై జీ7 దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్ చెప్పారు. అఫ్గాన్ లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగతున్న క్రమంలో భారతీయులను స్వదేశానికి ర్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వందల మందిని భారత్ కు తీసుకురాగలిగారు.

నిత్యం రెండు విమానాల ద్వారా భారతీయులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చెప్పారు. ఇదే సమయంలో అఫ్గాన్ సంక్షోభాన్ని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై అన్ని పార్టీల సభాపక్ష నేతలకు సమాచారం ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించినట్లు జైశంకర్ పేర్కొన్నారు.