Forces killed 50 Taliban: పంజ్ షీర్ లో ఫైట్..50మంది తాలిబన్లు హతం

Forces killed 50 Taliban: అప్ఘనిస్తాన్ మొత్తం దేశం తాలిబన్ల వశమైనా ఒకే ఒక్క ప్రాంతం మాత్రం ఇప్పటికీ తాలిబన్ల నీడ పడలేదు. వారు వెళ్లడానికి కూడా సాహసించని ప్రాంతం పంజ్ షీర్. తాజాగా దాన్ని ఆక్రమించుకోవడానికి బయలుదేరిన తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజ్ షీర్ పై దండెత్తిన తాలిబన్లకు గట్ి షాక్ తగిలింది. పంజ్ షీర్ లో పోరాటం ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అప్ఘనిస్తాన్ లో తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్ […]

Written By: NARESH, Updated On : August 24, 2021 12:48 pm
Follow us on

Forces killed 50 Taliban: అప్ఘనిస్తాన్ మొత్తం దేశం తాలిబన్ల వశమైనా ఒకే ఒక్క ప్రాంతం మాత్రం ఇప్పటికీ తాలిబన్ల నీడ పడలేదు. వారు వెళ్లడానికి కూడా సాహసించని ప్రాంతం పంజ్ షీర్. తాజాగా దాన్ని ఆక్రమించుకోవడానికి బయలుదేరిన తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజ్ షీర్ పై దండెత్తిన తాలిబన్లకు గట్ి షాక్ తగిలింది. పంజ్ షీర్ లో పోరాటం ప్రమాదకరమైన మలుపు తిరిగింది.

అప్ఘనిస్తాన్ లో తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్ షీర్ లోయ ఒకటి. ఆంధ్రాబ్ లో జరిగిన పోరులో 50మందికి పైగా తాలిబన్లు మరణించారని.. 20 మందికి పైగా బంధీలుగా చిక్కారని పంజ్ షీర్ నుంచి సమాచారం అందుతోంది.

పంజ్ షీర్ వీరులతో తాలిబన్ల పోరాటంలో ముగ్గురు సహచరులతోపాటు తాలిబన్ ప్రాంతీయ కమాండర్ ఒకరు మరణించినట్లు తాలిబన్కు చెందిన మరో ప్రాంతీయ కమాండర్ తెలిపారు. పంజ్ షీర్ తరుఫున ఒక ఫైటర్ మరణించినట్టు.. ఆరుగురు గాయపడినట్టు తెలిసింది.

అప్ఘనిస్తాన్ దేశమొత్తం తాలిబన్ల వశమైనా.. వారు ఇంకా ఆక్రమించుకోని కొన్ని ప్రాంతాలలో పంజ్ షీర్ లోయ ఒకటి. ఇక్కడ తిరుగుబాటు దారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అప్ఘన్ ఉపాధ్యక్షుడు సలేహ్ సైతం పంజ్ షీర్ కే మద్దతుగా ఉండి తాలిబన్లతో పోరాడుతున్నారు.

తాలిబన్ లు పంజ్ షీర్ వైపు దండెత్తగా.. మార్గమాధ్యంలోనే పంజ్ షీర్ వాసులు ఎదుర్కొని 300 మంది తాలిబన్లను హతమార్చినట్లు తెలిసింది. అయితే ఈ వార్తలను తాలిబాన్ ఖండించింది. పంజ్ షీర్ లోని రెండు జిల్లాలను ఆక్రమించినట్టు తాలిబాన్ ప్రకటించింది.

తాలిబాన్ లతో వేలాది మంది ప్రజలు సురక్షితంగా లేరని భావిస్తూ పంజ్ షీర్ కు పారిపోతున్నారు. ఈ ప్రాంతంలో తాలిబన్ లకు వ్యతిరేకంగా 9000 మంది సైనికులు సిద్దంగా ఉన్నారు. అప్ఘన్ దళాలు, తాలిబన్ తిరుగుబాటు దారులు కూడా పంజ్ షీర్ వచ్చి చేరుతున్నారు. వీరు తాలిబన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.