Yogi vs Akhilesh: ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా యూపీలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నాయి,. ఇదివరకే రెండు మార్లు అధికారం చేపట్టిన బీజేపీ మూడోసారి కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఐదేళ్ల పాలనలో యోగిపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ఎస్పీ ప్రయత్నిస్తోంది.

ధరల నియంత్రణలో వైఫల్యం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అటు పెట్రోధరల పెరుగుదల భయపెట్టిస్తోంది. ఇటు గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు లఖీంపూర్ ఘటన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. అధికార పార్టీకి చెందిన మంత్రి కుమారుడే రైతులను చంపి పార్టీకి అపఖ్యాతి తీసుకొచ్చారు. దీంతో యూపీలో అధికారం చేపట్టడం అంత సులువు కాదని తెలుస్తోంది.
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీని టార్గెట్ చేసుకుని అధికారం కోసం పోరు సాగిస్తున్నారు. ఎలాగైనా బీజేపీని అధికారానికి దూరం చేయాలని చూస్తున్నారు. దీనికి యోగి సర్కారు వైఫల్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కానీ బీఎస్పీ, కాంగ్రెస్ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోతున్నాయి. దీంతో అఖిలేష్ దూకుడు పెంచుతున్నారు. యోగి సర్కారును గద్దె దించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: పండుగ పూట థియేటర్లపై ఏపీ సర్కారు దాడులు.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బీఎస్పీ వెంట ఉన్న దళితుల ఓటు బ్యాంకు చీలిపోతోంది. ఇప్పుడు ఎస్పీ వెంట వెళ్లేందుకు చూస్తున్నారు. కొందరు బీజేపీని కూడా ఆశ్రయిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కు కూడా కొందరు జై కొడుతున్నారు. బీఎస్పీ వెనుకబడటంతో రాజకీయం పూర్తిగా మారిపోతోంది. ఈ క్రమంలో యూపీలో ఎవరు పట్టు సాధిస్తారో కూడా అంతుబట్టడం లేదు. కొన్ని సర్వేలు బీఎస్పీని విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో రాబోయే ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ యాదవ్ బలపడితే ఎస్పీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారనే వాదన వినిపిస్తోంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ కూడా ఎలాగైనా అధికారం దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. రాజకీయంగా రసవత్తర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: చినజీయర్ స్వామి ఆశ్రమ కార్యక్రమానికి కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత..!