Raghurama Resign: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ రఘురామ కృష్ణం రాజు తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. దీంతో దాన్ని క్యాష్ చేసుకుని అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఇబ్బందుల్లో పడనుంది. దీని కోసం రఘురామ రాజీనామాను ఆలస్యం చేయాలని ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.

ఏపీలో ధరల పెరుగుదల, రాజధాని వ్యవహారం, రోడ్ల సమస్య, పన్నుల పెంపు తదితర సమస్యలు ప్రజల వరకు చేరాయి. దీంతో రఘురామ రాజీనామా బెదిరింపులతో వైసీపీ డైలమాలో పడుతోంది. ఎలాగైనా రఘురామ రాజీనామాను ఆమోదింపజేయకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఒక వేళ ఉప ఎన్నిక జరిగితే దాని ప్రభావం త్వరలో జరిగే ఎన్నికలపై పడుతుందని భావిస్తోంది.
Also Read: రఘురామ రాజీనామా వెనుక ఇంత స్టోరీ ఉందా..?
రఘురామ అమరావతిని అస్ర్తంగా ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో అమరావతి రాజధానిగా చేయాలనే డిమాండ్ ఎక్కువగా వస్తోంది. దీంతో అదే ఊపుతో ఆయన ఎన్నికకు వెళితే విజయం తథ్యమని తెలుస్తోంది. ఇప్పటికే రఘురామ బీజేపీలో చేరతారని ప్రచారం సాగినా దానిపై స్పష్టత లేదు. అమరావతి రాజధానికిగా ఎంచుకుంటే స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలవవచ్చని సమాచారం.
రాష్ర్టంలో అభివృద్ధి పనులు మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వంపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నికకు వెళితే వైసీపీకి నష్టమే జరగనుందని తెలుస్తోంది. దీంతో రఘురామ వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది. ఆయన రాజీనామా చేస్తే తలెత్తే పరిణామాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పట్లో రాజీనామా చేయకుండా చూడాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా రాష్ర్టంలో త్వరలో రాజకీయ పెనుమార్పులు జరుగుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది.
Also Read: రాజీనామాకు రఘురామ సిద్ధం..మళ్లీ గెలవడం కల్ల?