https://oktelugu.com/

Bheemla Nayak Movie: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్… రిలీజ్ ఎప్పుడంటే

Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 11:24 AM IST
    Follow us on

    Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    bheemla nayak movie makers announce new release date

    Also Read: ఆర్ఆర్ఆర్ దెబ్బకు భీమ్లా నాయక్ వాయిదా?

    తాజాగా ఈ మూవీని విడుదల తేదీలో మార్పులు చేసినట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని అందరికంటే ముందుగానే స్లాట్ బుక్ చేసింది టీమ్. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చి కొన్ని నెలలు దాటేసింది. కానీ పలు కారణాల రీత్యా ఈ సినిమాని సంక్రాంతికి కాకుండా.. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అఫీషియల్ గా వెల్లడించారు. ఈరోజు జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

    అలానే అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘ఎఫ్3’ సినిమా రిలీజ్ డేట్ ని కూడా వాయిదా వేశారు. ఏప్రిల్ 29న ‘ఎఫ్3’ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని.. ఏప్రిల్ 1న సినిమా విడుదలవుతుందని చెప్పారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. పాటలు, ప్రోమొలకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ వార్తతో పవన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

    Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ హైలైట్స్.. అంచనాలు తలకిందులైన వేళ..!