
Yogi Adityanath: ఆ మధ్య ఉత్తర ప్రదేశ్ లో సీఏఏ బిల్లు మీద పెద్ద రగడ జరిగింది. ముస్లింలు రోడ్లమీదకి వచ్చి ఆందోళనలు చేశారు. అయితే యూపీ పోలీసులు వారిని చెదరగొట్టడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ లాఠీచార్జిలో కొంతమంది గ్యాంగ్ స్టర్లు పోలీసులకు దొరికిపోయారు. అంటే ఆ ఆందోళన వెనుక ఎవరి ప్లాను ఉందో? ఎవరి ప్రయోజనం దాగుందో చెప్పాల్సిన అవసరం లేదు..ఆ గ్యాంగ్ స్టర్ల ను అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు.. చెప్పుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న నిర్ణయాలు ఒక పట్టాన కొరుకుడు పడవు.
యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడతానని, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిని మట్టిలో పాతి పెడతానని ప్రమాణం చేశాడు. తాను ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు యూపీ అంటే దౌర్జన్యాలకు మారుపేరు. గుండాలకు అడ్డా. రౌడీ షీటర్లకు స్థావరం. సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ ల ఏలుబడిలో అలాంటివారు పాతుకుపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేశారు. దీంతో అక్కడ శాంతిభద్రతలు అధ్వానంగా మారిపోయాయి. అలాంటి సమయంలోనే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తాను ఏ మాట అయితే ఇచ్చారో.. ఆ మాటను నిలుపుకునేందుకు ఆయన కంకణ బద్ధులై ఉన్నారు.
అన్యాయం చేస్తే ఎన్కౌంటర్.. అన్యాయానికి పాల్పడిన వారు.. పోలీస్ కటకటాల వెనుక.. ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ అనుసరిస్తున్న న్యాయం, పాటిస్తున్న ధర్మం. ఇలాంటి మోడల్ న్యాయాన్ని విమర్శిస్తూ ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు. ఎంతోమంది కుహనా మేధావులు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ యోగి వెనకడుగు వేయడం లేదు. అంతే కాదు అక్రమాలకు పాల్పడిన వారికి బుల్డోజర్ శిక్ష వేస్తున్నారు. యోగి సర్కార్ దూకుడు చర్యల వల్ల చాలామంది అక్రమార్కులు, రౌడీ షీటర్లు స్వచ్ఛందంగా జైలుకు వెళ్తున్నారు. తమను బయటకు వస్తే ఏ ఎన్కౌంటర్లో లేపేస్తారేమోనని భయంతో వారు జైల్లోనే తలదాచుకుంటున్నారు. యోగి ఆరు సంవత్సరాల పాలనలో వందలకొద్ది రౌడీషీటర్లు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నవారు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు.

ఝాన్సీ, ఘజియాబాద్, ప్రయాగ్ రాజ్, లక్నో, అగ్రా ప్రాంతాల్లో ఉన్న దాదాపు మెజారిటీ రౌడీషీటర్లు ఇప్పుడు జైల్లోనే మగ్గిపోతున్నారు. కొంతమందిని సత్ప్రవర్తన కింద జైలు అధికారులు విడుదల చేసినప్పటికీ మేము బయటకు వెళ్ళమంటూ ప్రాధేయ పడుతున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడి యోగి సర్కారు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. కేవలం ఎన్కౌంటర్ల ద్వారానే వందల కొద్ది రౌడీషీటర్లు హతమయ్యారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉత్తర ప్రదేశ్ లో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ ఆహ్మద్ ను ఒక కేసు విచారణ సంబంధించి పోలీసులు ప్రయాగ్రాజ్ కోర్టులో హాజరు పరిచారు.. కోర్టులోకి వెళ్లే ముందు ఆ గ్యాంగ్ స్టర్ విలేకరులతో మాట్లాడాడు.. తన పని అయిపోయినట్టేనని, కానీ తన కుటుంబ సభ్యులను మాత్రం ఏం చేయకూడదని ప్రభుత్వాన్ని ప్రాధాయపడ్డాడు.
ఈ అతీక్ అహ్మద్ మరెవరో కాదు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్పాల్ హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైలు లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడిపై ఏకంగా 100 కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ఇటీవల హత్యకు గురయ్యాడు. అతనితోపాటు ఇద్దరు గన్ మెన్లను కూడా కాల్చి చెప్పడం ఉత్తరప్రదేశ్లో సంచలనం రేకెత్తించింది.. దీనిపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికి పోయింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ నిందితులపై కాటిన చర్యలు తీసుకుంటామని శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆమెకు తగ్గట్టుగానే ఉమేష్ పాల్ ను హత్య చేసిన ఓ వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్లో హత మార్చారు. మరోవైపు ఉమేష్ పాల్ హత్య కేసులో అహ్మద్ పై కూడా అభియోగం నమోదయింది. కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అహ్మద్ ను విచారణ సందర్భంగా పోలీసులు ప్రయాగ్ రాజ్ కోర్టుకు తరలించారు. అయితే ఈ సందర్భంగా తనను ఏమీ చేయొద్దంటూ అహ్మద్ పోలీసులను ప్రాధేయపడటం విశేషం.