Yellow Alert In Hyderabad: చలి పంజా రోజురోజుకూ పెరుగు తుంది. సాధారణంగా చలికాలం అన్నాక చలి తీవ్రత అంతటా ఉంటుంది. అయితే ఈసారి భాగ్యనగరం లో కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా ఈసారి హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడి పోయాయి. గత మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడి పోవడంతో హైదరాబాద్ లో వాతావరణం కాశ్మీర్ వాతావరణం లాగా అనిపిస్తుంది.
గత పది సంవత్సరాలలో ఎన్నడూ చూడని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ లో పాళీ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ శనివారం తెల్లవారు జామున పఠాన్ చెరు లో 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇప్పటి వరకు ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడు హైదరాబాద్ లో నమోదు అవలేదు.
2015 డిసెంబర్ 13న 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వగా ఇప్పటి వరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రతగా రికార్డ్ ఉంది. అయితే నిన్న హైదరాబాద్ లో నమోదు అయినా ఉష్ణోగ్రతతో ఈ రికార్డ్ మాయం అయ్యి కొత్త రికార్డ్ సెట్ అయ్యింది. మరొక నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చలికి తోడు గాలులకు కూడా వణికి పోతున్న భాగ్యనగరం వాసులు ఈ వార్త విని ఇంకా హడలి పోతున్నారు.
Also Read: సుందరమైన విశాఖ తీరం ఇలా ఎందుకు మారుతోంది..?
రానున్న నాలుగు రోజుల్లో మరొక 3 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు 6 నుండి 8 కిలో మీటర్ల వేగంతో చల్లని గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి డిసెంబర్ 21 వరకు నగర వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. అంతేకాదు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలకు కూడా వచ్చే కొన్ని రోజుల వరకు ఆరెంజ్ వార్ణింగ్ ను జారీ చేసింది.
ఒకవైపు చలి పంజా విసురుతుంటే మరొక వైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజల్లో మరొక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే తెలంగాణ లో కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయట. దీంతో తెలంగాణ లో మొత్తం 20 కేసులు అయ్యాయి. చలి ప్రభావం ఎక్కువ ఉండడం తో ఆరోగ్య పరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండ పాటించాలని వారు సూచిస్తున్నారు.
Also Read: వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరు.. నేతల మధ్య కానరాని సఖ్యత