https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’ రన్​టైమ్​పై భిన్నాభిప్రాయాలు.. నిర్మాత స్పందన ఏంటంటే?

Pushpa: సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ బన్నీ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ.. టాక్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇంటర్వెల్​ ముందు సినిమాను పరిగెత్తించిన సుకుమార్​.. సెకండ్​ ఆప్​ను ల్యాగ్​ చేసిపడేశారని అంటున్నారు. సుమారు 3 గంటల రన్​టైమ్​ ప్రేక్షకులకు విసుగొచ్చేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు. కానీ, బన్నీ నటనతో పాటు కథలో ఏం జరుగుతుందో అన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 11:20 AM IST
    Follow us on

    Pushpa: సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ బన్నీ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ.. టాక్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇంటర్వెల్​ ముందు సినిమాను పరిగెత్తించిన సుకుమార్​.. సెకండ్​ ఆప్​ను ల్యాగ్​ చేసిపడేశారని అంటున్నారు. సుమారు 3 గంటల రన్​టైమ్​ ప్రేక్షకులకు విసుగొచ్చేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు. కానీ, బన్నీ నటనతో పాటు కథలో ఏం జరుగుతుందో అన్న విషయమే థియేటర్లలో అంత సేపు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగిందని టాక్​. దీనిపై సినిమా నిర్మాతలు స్పందిస్తూ.. పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

    ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతు చేపట్టింది. నిర్మాత నవీన్ యెర్నేని స్పందిస్తూ.. పెద్ద పెద్ద హీరోలు, దర్శకుల సినిమాలకు మూడు గంటల రన్​టైమ్​ సాధారణమని.. గతంలో రంగస్థలం సనినిమా కూడా ఇలాగే రన్​టైమ్ వేసినట్లు గుర్తు చేశారు. సినిమా అన్నాక అక్కడక్కడా కాస్త లాగ్​ ఉండటం సహజమని.. కానీ, కథకు తగ్గట్లు సన్నివేశాలు ఉండాలంటే.. ఆ మాత్రం రన్​టైమ్ అవసరమని అన్నారు. ప్రేక్షకులైతే దాని గురించి ఎలాంటి ఆందోళన చెందరని.. తాము డబ్బుకోసం పాకులాడే వ్యక్తులం కాదని తెలిపారు. అలాగైతే రన్​టైమ్ తగ్గించి.. రోజుకు 5 షోలు వేయించే సత్తా కూడా ఉందని అన్నారు. 3 గంటల రన్​టైమ్ కారణంగానే 4 షోలు మాత్రమే వేశారన్నారు… ఇలా సినిమా రన్​టైమ్​పై వస్తున్న భిన్నాభిప్రాయాలపై తనదైన స్టైల్​లో వివరణ ఇచ్చారు నిర్మాత.

    కాగా, రెండో భాగాన్ని ఫిబ్రవరిలో షూటింగ్​ ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు పుష్ప ది రైజ్​ను సంక్రాంతి కానుకగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్ల తెలుస్తోంది.