https://oktelugu.com/

బీజేపీకి మద్దతు.. వైసీపీలో గుబులు?

ఈ మధ్య కేంద్రం ఎలాంటి షరతులు పెడుతున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓకే అంటూ తలాడిస్తున్నారు. కేంద్రం ఎలాంటి బిల్లులు ప్రవేశ పెడుతున్నా అన్నింటికీ మద్దతు తెలుపుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వాటిని తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారు. రాష్ట్రపతి నియామకం నుంచి.. నిన్నటి విద్యుత్‌ సవరణ చట్టం వరకూ.. బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. Also Read: చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకోరా…? లోక్‌సభ, రాజ్యసభల్లో 28 మంది ఎంపీలను కలిగి ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 02:42 PM IST
    Follow us on


    ఈ మధ్య కేంద్రం ఎలాంటి షరతులు పెడుతున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓకే అంటూ తలాడిస్తున్నారు. కేంద్రం ఎలాంటి బిల్లులు ప్రవేశ పెడుతున్నా అన్నింటికీ మద్దతు తెలుపుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వాటిని తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారు. రాష్ట్రపతి నియామకం నుంచి.. నిన్నటి విద్యుత్‌ సవరణ చట్టం వరకూ.. బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

    Also Read: చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకోరా…?

    లోక్‌సభ, రాజ్యసభల్లో 28 మంది ఎంపీలను కలిగి ఉన్న వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ.. కేంద్రం తీసుకొస్తున్న ప్రతీ బిల్లుకు సై అంటోంది. అవసరమైనప్పుడల్లా ఓట్లు కూడా వేయిస్తోంది. అయితే.. తాజాగా వివాదాస్పదంగా మారిన వ్యవసాయ బిల్లుకు కూడా ఏకపక్షంగా వైసీపీ ఆమోదం తెలపడం విమర్శలకు దారితీసింది. అందులోని లోటుపాటు.. లొసుగులను చదవకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై పార్టీల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ బిల్లుకు నిరసనగా ఎన్టీఏ మిత్రపక్షమైన అకాలీదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి హర్‌‌ సిమ్రత్‌ కౌర్‌‌ తన కేంద్ర మంత్రి పదవికి రిజైన్‌ చేశారు.

    ఎన్డీఏ నుంచి వైదొలిగేందుకు కూడా ఆలోచిస్తున్నామని అకాలీదళ్ ప్రకటించారు. అకాలీదళ్ బీజేపీకి సుదీర్ఘ స్నేహితుడు. అందరూ బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న సమయంలో అకాలీదళ్‌తోపాటు శివసేన బీజేపీతో పొత్తుల్లో ఉండేవి. శివసేన ఇప్పటికే ఎన్టీయే నుంచి బయటికి వెళ్లిపోయింది. తాజాగా అకాలీదళ్ బయటకు వచ్చేసింది. దీంతో ఎన్డీఏలో బలం ఉన్న పార్టీల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

    వ్యవసాయ బిల్లుపై అటు ఉత్తరాదిలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. ఆ బిల్లుతో ప్రభుత్వం తన బాధ్యతను తగ్గించుకుంటోందని.. ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని వ్యవసాయ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. చివరకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన పంజాబ్‌లోనూ నిరసనలు ఎదురయ్యాయి. పంజాబ్‌కే చెందిన హర్‌సిమ్రత్‌కౌర్ రాజీనామా చేశారు.

    Also Read: న్యాయస్థానాలతో పెట్టుకోవడం జగన్ వ్యూహంలో భాగమా…?

    కానీ.. ఏపీలోని వైసీపీ మాత్రం ఈ బిల్లుపై ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదు. పైగా పంజాబ్‌లో రాజకీయ పరిస్థితుల కారణంగానే హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారని వైసీపీకి చెందిన  ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుకొచ్చారు. మొత్తానికి కేంద్రానికి ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే వైసీపీ ఇలా వ్యవహరిస్తుండడంతో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళుతున్నామా అన్న ఆందోళన వైసీపీలో మొదలైందట.. ఇదే జరిగితే రాజకీయంగా పెద్ద నష్టమని వైసీపీ భావిస్తోందని తెలిసింది.