హైటెక్ సిటీలు నిర్మించడంలో.. హైటెక్ చిత్రాలు చూపించడంలో చంద్రబాబు గారి తీరే వేరబ్బా.. అమరావతిని నిర్మించకముందే సింగపూర్ లా దానిని గ్రాఫిక్స్ లో చూపించిన తీరు నభూతో నభవిష్యతి. అసలు అలాంటి ఐడియాలు చంద్రబాబుకు ఎలా వస్తాయో కూడా ప్రధాన పక్షాలకు అర్థం కాదు.. కానీ ఎంతైనా చంద్రబాబు పెట్టే ఖర్చు ఓ రేంజ్లో ఉంటుందని తాజాగా తేలింది.
Also Read: బీజేపీకి మద్దతు.. వైసీపీలో గుబులు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక.. ఏపీకి సచివాలయం కరువైంది. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయం అంటూ నిర్మించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకుంది. అటు కేంద్రం కూడా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలనుకుంది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయం, కేంద్రం నిర్మిస్తున్న పార్లమెంట్ భవనాల ఖరీదు కంటే చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక సచివాలయం ఖర్చే ఎక్కువట.
ఒక అంచనా ప్రకారం, వెలగపుడిలోని తాత్కాలిక సచివాలయానికి 2015లో చంద్రబాబు చేసిన నిర్మాణ వ్యయం సుమారు రూ.750 కోట్లు. అయితే ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రికార్డుల ప్రకారం, టీడీపీ ప్రభుత్వం అంతర్గత మరియు బాహ్య మౌలిక సదుపాయాలపై 526.57 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పార్లమెంటు భవనం కోసం రూ.865 కోట్లు కోట్ చేసిన ఎల్అండ్‌టీనే అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించింది.
ఐదేళ్ల క్రితం రూ.750 కోట్ల రూపాయల వ్యయంతో ‘తాత్కాలిక సచివాలయం’ నిర్మాణం జరిగితే, పార్లమెంట్ భవనం నిర్మాణానికి ప్రస్తుతం వెచ్చిస్తోంది రూ.861.90 కోట్లు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.861.90 కోట్లు కోట్ చేయడం ద్వారా టెండర్ దక్కించుకుంది. అమరావతిలో వెలగపుడి వద్ద చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మునుపటి టీడీపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయంతో పోల్చినప్పుడు, కొత్త పార్లమెంట్ భవనం చౌకదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీనిపైనే మీడియాలో ఒక విభాగంలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
Also Read: వైసీపీకి మరో షాకిచ్చిన ఎంపీ రఘురామ
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల కూల్చివేసిన పాత సచివాలం స్థానంలో సరికొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఇవ్వాలని పిలుపునిచ్చింది. నిర్మాణ వ్యయం రూ.500 కోట్లు నిర్ణయించింది. ఇది శాశ్వత నిర్మాణం కాబట్టి, అమరావతిలో చంద్రబాబు నాయుడు తాత్కాలిక సచివాలయంతో పోలిస్తే ఇది ఖచ్చితంగా తక్కువే!
2015లో అప్పటి ధలరకు.. ఇప్పటి ధరలకు చాలావరకు పొంతన లేకుండా ఉంది. మరి అప్పుడే కేవలం తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చంద్రబాబు పెట్టిన ఖర్చుతో పోల్చితే.. ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్న తెలంగాణ సచివాలయం, పార్లమెంట్ల భవనాలకు పెడుతున్న ఖర్చు చాలా తక్కువనేని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.