https://oktelugu.com/

వైసీపీకి మరో షాకిచ్చిన ఎంపీ రఘురామ

అధికార పార్టీ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ పార్టీ అధిష్ఠానం మీద.. ప్రభుత్వం మీద ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆయన మీద సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌గా ఉన్నారు. అయినా రఘురామకృష్ణరాజు విమర్శలు చేయడం ఆపలేదు. ఒకవిధంగా ఆయన ఇప్పుడు బహిష్కృత ఎంపీగానే కొనసాగుతున్నారు. దీనికితోడు ఈ మధ్య పార్లమెంట్‌ సమావేశాలకు సన్నద్ధ సమావేశానికి కూడా జగన్‌ ఆ ఎంపీని ఆహ్వానించలేదు. ఎప్పటికప్పుడు అధిష్ఠానం రఘురామకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 02:31 PM IST
    Follow us on

    అధికార పార్టీ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ పార్టీ అధిష్ఠానం మీద.. ప్రభుత్వం మీద ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆయన మీద సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌గా ఉన్నారు. అయినా రఘురామకృష్ణరాజు విమర్శలు చేయడం ఆపలేదు. ఒకవిధంగా ఆయన ఇప్పుడు బహిష్కృత ఎంపీగానే కొనసాగుతున్నారు. దీనికితోడు ఈ మధ్య పార్లమెంట్‌ సమావేశాలకు సన్నద్ధ సమావేశానికి కూడా జగన్‌ ఆ ఎంపీని ఆహ్వానించలేదు. ఎప్పటికప్పుడు అధిష్ఠానం రఘురామకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.

    Also Read: చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకోరా…?

    ఇప్పుడు తాజాగా.. వైసీపీ అధిష్ఠానానికి ఎంపీ రఘురామకృష్ణం రాజు ఝలక్‌ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఎంపీ కార్యాలయం పేరును మార్చేశాడు. ఇదివరకున్న ‘వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ నరసాపురం పార్లమెంట్‌ సభ్యుల వారి కార్యాలయం’ పేరును ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’గా మార్చాడు. అంతేకాదు.. ఫ్లెక్సీల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు తొలగించడం దుమారం రేపింది.. ఈ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే.. దీనిపై ఇంతవరకూ ఎంపీ స్పందించలేదు.

    తాజాగా రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మరోసారి వైసీపీ ఎంపీలపైనే మండిపడ్డారు. పార్లమెంట్‌ లోపల, బయట న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కోర్టులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరని వ్యాఖ్యానించారు.

    Also Read: న్యాయస్థానాలతో పెట్టుకోవడం జగన్ వ్యూహంలో భాగమా…?

    అంతేకాదు.. ‘నా సహచర ఎంపీలతోనే నన్ను కొట్టిస్తా అంటూ నీచంగా మాట్లాడిస్తున్నారు. వారి భవిష్యత్ ఏంటో త్వరలోనే తేలుస్తా. ఆకు రౌడీలు ఏదో చేస్తారని నేను భయపడే స్థాయిలో లేను. నా ఒంటిపై చేయి పడితే నన్ను కాపాడేందుకు హేమహేమీలున్నారు. పులివెందులలో 10 వేల మందితో సమావేశం పెడతాను. అక్కడ నన్ను ప్రేమించేవారున్నారు. ప్రభుత్వం ఎన్ని ఉన్మాద చర్యలు చేసిన కోర్టులు చిరంజీవులుగా మిగులుతాయి. రాబోయే రోజులన్నీ మంచిరోజులే. అమరావతి రైతులెవరు ఆందోళన చెందొద్దు. ప్రత్యేక హోదా మా పార్టీ ప్రాధాన్యత అంశంగా కనిపించడం లేదు’ అని వైసీపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి దీనిపై సీఎం జగన్‌ రియాక్షన్ ఇస్తారా?‌, వైసీపీ ఎంపీ ఇలానే దూకుడుగా వెళుతారా అన్నది వేచిచూడాలి.