కాంగ్రెస్ లో కుమ్ములాటలు మళ్లీ బయటపడ్డాయి. ఓ రేపిస్ట్ కు కాంగ్రెస్ టికెట్ ఇస్తున్నారని ఓ మహిళా కార్యకర్త గళమెత్తింది. దీంతో ఆగ్రహంతో కార్యకర్తలు ఆమెపై దాడి చేసి ఈడ్చిపడేశారు. దీనిపై ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. తారాయాదవ్ పై దాడిని బీజేపీ ఖండించింది.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎవరు ముందున్నారంటే..?
కాగా కాంగ్రెస్ మహిళా నేతపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ డిమాండ్ చేశారు. మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా దీనిపై ప్రశ్నించింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా తమ దృష్టికి వచ్చిందని ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకురాలు తారా యాదవ్ పై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. యూపీలోని డియోరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుంద్ భాస్కర్ మణికి తాజాగా ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తారయాదవ్ వ్యతిరేకించారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి ఈడ్చిపడేశారు. కాంగ్రెస్ పార్గీ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: భారత్ వరుస క్షిపణుల ప్రయోగాలు.. యుద్ధానికి సిద్ధమా..?
సమావేశం జరుగుతుండగా మహిళా నేత తార అక్కడికి చేరుకొని ముకుంద్ భాస్కర్ కు టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నించింది. దీంతో ఆమెపై దారుణంగా కొట్టిపడేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని షేర్లు చేస్తూ బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Congress' Tara Yadav manhandled by party workers at an event in Deoria.(10.10)
She says,“I was thrashed by party workers when I questioned party's decision to give a ticket to a rapist, Mukund Bhaskar for upcoming by-polls. Now, I'm waiting for Priyanka Gandhi ji to take action” pic.twitter.com/MYYp8k1GLX
— ANI UP (@ANINewsUP) October 11, 2020