https://oktelugu.com/

‘ఫార్మాసిటీ’ పేరుతో లూటీనా? కోమటిరెడ్డి, భట్టి హాట్ కామెంట్స్

ఫార్మాసిటీ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రంగారెడ్డిలోని యాచారంలో జరిగిన ఫార్మాసిటీ వ్యతిరేక సభలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఫార్మాసిటీ అంటేనే ఓ పెద్దకుంభకోణమని దుయ్యబట్టారు. ప్రజలు గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఫార్మాసిటీ పేరుతో భూములను ప్రభుత్వం లాక్కోంటుందంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. Also Read: హాట్ టాపిక్: కేటీఆర్‌‌తో ప్రశాంత్‌ కిషోర్‌‌ భేటీ అందుకేనా? టీఆర్ఎస్ సర్కార్ హయాంలో సర్పంచుల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 05:46 PM IST
    Follow us on

    ఫార్మాసిటీ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రంగారెడ్డిలోని యాచారంలో జరిగిన ఫార్మాసిటీ వ్యతిరేక సభలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఫార్మాసిటీ అంటేనే ఓ పెద్దకుంభకోణమని దుయ్యబట్టారు. ప్రజలు గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఫార్మాసిటీ పేరుతో భూములను ప్రభుత్వం లాక్కోంటుందంటూ కోమటిరెడ్డి ఆరోపించారు.

    Also Read: హాట్ టాపిక్: కేటీఆర్‌‌తో ప్రశాంత్‌ కిషోర్‌‌ భేటీ అందుకేనా?

    టీఆర్ఎస్ సర్కార్ హయాంలో సర్పంచుల నుంచి ఎమ్మెల్యేలకు వరకు అందరూ ధనార్జనే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి కేటీఆర్.. ఫార్మాసిటీల పేరుతో మాత్రం శ్మశానవాటికలను కట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో నల్లొండ జిల్లాను టీఆర్ఎస్ సర్కార్ సర్వనాశనం చేసిందన్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ ప్రజలపై రూ.3లక్షల కోట్ల భారం మోపుతోందన్నారు. ఈ ఎల్ఆర్ఎస్ తోనే టీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

    కరోనా సమయంలో ప్రజలను దోచుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ సిద్ధమవుతుండటంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఒకేదగ్గర 20 ఫార్మా కంపెనీలను పెట్టి టీఆర్ఎస్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాడం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే టీఆర్ఎస్ నేతలకు లెక్కలేదా? అంటూ ప్రశ్నించారు.

    Also Read: రూల్స్ అంటే రూల్సే.. కేసీఆర్‌‌ ఆస్తులు సైతం నమోదు

    ఫార్మాసిటీ పేరుతో పచ్చటి పంటపొలాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. రైతుల పొలాలను లాక్కోవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ప్రజలు మరో మూడేళ్లు భూములను కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ సమస్య ఉందన్నారు. ఇక ఎల్ఆర్ఎస్ ను ఎవరు చేసుకోవద్దని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు.