‘బిగ్‌బాస్ సీజన్ 4’లో అత్యంత ప్రజాధరణ పొందిన సెలెబ్రిటీ ఎవరైనా ఉన్నారా అనగానే.. అందరూ ముందుగా ముక్తకంఠంతో చెప్పే పేరు ‘గంగవ్వ’నే. బిగ్ బాస్ అనే బిగ్ రియాలిటీ షో గురించి పెద్దగా ఏమి తెలియని గంగవ్వను ‘షో’లోకి తీసుకోవడం, కచ్చితంగా ‘షో’కి నష్టం అని, పైగా ‘షో’లో ఆమె ఎక్కువ రోజులు ఉండదని నెటిజన్లు మొదట్లో బాగానే ట్రోల్ చేశారు. అయితే అనూహ్యంగా గంగవ్వను షోలో తీసుకోవడం గంగవ్వకు కంటే కూడా, బిగ్ బాస్ షోకే ఎక్కువ ప్లస్ అయింది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మొత్తానికి గంగవ్వను శనివారం ఎలిమినేట్ చేశారు. ఇంటి నుంచి బయటికి పంపించారు. అయితే గంగవ్వ ఇంటి నుంచి పంపించడానికి వేరే కారణం ఉందట.
Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ !
మొదటి నుంచి హౌస్ లో గంగవ్వ పేరు చెప్పుకొని సేఫ్ గేమ్ ఆడటం మొదలు పెట్టారట కొందరు కంటెస్టెంట్లు. అంతెందుకు.. ఈ హౌస్ లో హీరో ఎవరు? అని అడిగితే.. అందరూ టక్కున గంగవ్వ పేరే చెబుతూ ఎవరికీ వారు సేఫ్ అయిపోతున్నారు. ఇటీవల చందనా బ్రదర్స్ టాస్క్ లోనూ గంగవ్వనే గెలిపించారు. హౌస్ లో ఏ కంటెస్టెంట్ గురించి నిర్ణయం తీసుకోవాలన్నా.. గంగవ్వ నువ్వు చెప్పు.. ఎవరనుకుంటున్నావు అంటూ.. ఆమె ఎవరి పేరు చెబితే వాళ్లకు జై కొడుతూ మిగితా కంటెస్టెంట్లు అంతా అతితెలివి చూపిస్తున్నారు. మొదటి రోజు నుండి ఇదంతా బిగ్ బాస్ యాజమాన్యం చాలా నిశితంగా పరిశీలిస్తోంది.
Also Read: అమితాబ్ పై అప్యాయతను చాటుకున్న చిరంజీవి
దీనికితోడు మిగితా కంటెస్టెంట్లు గంగవ్వను ఎవ్వరూ నామినేట్ కూడా చేయడం లేదు. రానున్న రోజుల్లోనూ ఆమెను ఎవ్వరూ నామినేట్ చేయరు అనేది ఉహించుకోవచ్చు. గంగవ్వను చూసి ఎక్కువ కంటెస్టెంట్లు జాలి పడుతూ పోటి ఇవ్వట్లేదట. కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడటానికి గంగవ్వను ఒక పావులా వాడుకుంటున్నారని అర్థం చేసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం.. చివరకు ఆరోగ్యం పేరుతో గంగవ్వను బయటికి పంపించేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు గంగవ్వ ఇంట్లో లేదు. ఇక.. ఇంటి సభ్యులు ఎలాంటి సేఫ్ గేమ్ ఆడే చాన్స్ ఇక నుండి ఉండదు కాబట్టి ఇప్పటికైనా వారు తమ ఆటను తామే ఆడతారో లేదో చూడాలి.