Chennai Rains: తమిళనాడు ఇప్పుడు కన్నీటి సాగరాన్ని తలపిస్తోంది.ఈశాన్య రుతుపవనాల రాకతో తమిళనాడు వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది.
సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ, మున్సిపల్ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తమిళనాడు రెవెన్యూశాఖ ప్రకటించింది.
తాజాగా ఈ ఉదయం చెన్నైలోని టీపీ సత్రం ప్రాంతంలో మహిళా పోలీస్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరి ఓ వ్యక్తిని కాపాడిన తీరు నెట్టింట్లో వైరల్ గా మారింది. అనారోగ్యంతో శ్మశాన వాటికలో అపస్మార స్థితిలో ఉన్న 28 ఏళ్ల యువకుడిని ఎస్ఐ రాజేశ్వరి ఏకంగా తన భుజాలపై మోసి ఆస్పత్రికి తరలించడం విశేషం.
Also Read: chennnai:జలదిగ్భంధంలో ఆ 15 వార్డులు.. చెన్నైలో దారుణం..
తొలుత రాజేశ్వరి భుజాలపై యువకుడిని ఎత్తుకొని కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా.. అందులో రోగులు నిండిపోవడంతో సాధ్యం కాలేదు. ఎదురుగా వస్తున్న ఆటో వద్దకు పరిగెత్తుకెళ్లి మరీ ఆ సహాయకులను ఆస్పత్రికి తరలించిన రాజేశ్వరి తెగువను చూసి అందరూ ‘శభాష్ రాజేశ్వరి’ అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
-వైరల్ వీడియో