మినీ సంగ్రామంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉండేనా..?

కరోనా కాలం తరువాత అత్యధిక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్తో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల వాతావరణం ఏర్పడి మినీ సంగ్రామంలా మారింది. ఇందులో పశ్చమ బెంగాల్ పై అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్రంలోని అగ్రనాయకులంతా ఆ రాష్ట్రంలో పర్యటించి అలజడి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతను ఎలాగైనా గద్దె దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే […]

Written By: NARESH, Updated On : February 28, 2021 2:42 pm
Follow us on

కరోనా కాలం తరువాత అత్యధిక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్తో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల వాతావరణం ఏర్పడి మినీ సంగ్రామంలా మారింది. ఇందులో పశ్చమ బెంగాల్ పై అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్రంలోని అగ్రనాయకులంతా ఆ రాష్ట్రంలో పర్యటించి అలజడి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతను ఎలాగైనా గద్దె దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వచ్చే నెలలోనే ఎన్నిక ప్రక్రియ మొదలు కానున్నందున కొన్ని సర్వే సంస్థలు అధికారంలోకి ఎవరొస్తారో చెప్పేస్తున్నారు.

గత సెప్టెంబర్లో బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ముందు కొన్ని సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. ఇందులో బీజేపీ ఈ రాష్ట్రాన్ని కోల్పోతుందని, ఆర్జేడీకి ఈ రాష్ట్రం సొంతం కానుందని ప్రకటించాయి. ఇక ఆఫ్టర్ ఎలక్షన్ కొన్ని సర్వే సంస్థలు బీజేపీ, ఆర్జేడీ మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పాయి. కానీ సర్వేలకు భిన్నంగా ఇక్కడి పలితాలు వెలువడ్డాయి. వనసైడ్ వార్ అన్నట్లుగా బీజేపీయే ఎక్కువ సీట్లు కొట్టేసింది. ఇచ్చిన మాట ప్రకారం జేడీయూకి సీఎం పదవి ఇచ్చి కూర్చోబెట్టింది.

తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపంచడం లేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి వారు ఇప్పుడే మళ్లీ మమతకే అధికారం వస్తుందని అంచనా వేస్తున్నాడు. అయితే మూడోసారి అధికారంలోకి రావాలంటే మాటలు కాదని, ఈ సారి ఇక్కడ టైట్ పొజిషన్ ఉండవచ్చని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ సర్వే సంస్థలు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. బీహార్ లో మాదిరిగా మళ్లీ పప్పులో కాలేస్తే సర్వేలపై జనాసక్తి పోతుందని భావిస్తున్నారు.

గతంలో కంటే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఒకే పార్టీకి అనుకూలంగా మారి తాము అభిమానించే పార్టీ గెలుస్తుందని ప్రచారం చేస్తున్నాయి. బీహార్ ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. పదే పదే కొన్ని మీడియా వర్గాలు ఒకే పార్టీపై ప్రచారం చేయడంతో ఫలితాల తరువాత సర్వేలపై ప్రజల అభిప్రాయం మారింది. దీంతో సర్వేలపై ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా కొన్ని ప్రీపోల్ సర్వేలు నిర్వహించగా ప్రస్తుతం జరగబోయే రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీకి అనుకూలంగా రావడం లేదు. రైతు చట్టాలు, పెట్రోల్ ధరలు ఇతర విషయాలపై కాషాయం పార్టీపై ప్రజలు మనసు మార్చుకున్నారట. అంతేకాకుండా సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం తాత్సారం చేయడం కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారిందనే వార్తలు వస్తున్నాయి.