శ్రీధర్ బాబుకు నీతిలేదు.. వామన్ రావు ఆడియో వైరల్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అడ్వొకేట్ దంపతులు వామన్ రావు.. నాగమణి హత్యకేసు రోజకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ హత్యకేసులో అధికార పార్టీ నేతలు పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు రోజుకో కొత్తరకమైన ట్విస్టులు ఈకేసులో పోలీసులు ఎదుర్కొంటున్నారు. వామన్ రావు బాధితుల సంఘం పేరిట ఓ వాట్సప్ గ్రూపు సృష్టించి పోలీసులు, జర్నలిస్టలును సైతం అందులో సభ్యులా చేర్చారు. రామగిరికి చెందిన కీలక నేత ఒకరు […]

Written By: Srinivas, Updated On : February 28, 2021 2:28 pm
Follow us on


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అడ్వొకేట్ దంపతులు వామన్ రావు.. నాగమణి హత్యకేసు రోజకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ హత్యకేసులో అధికార పార్టీ నేతలు పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు రోజుకో కొత్తరకమైన ట్విస్టులు ఈకేసులో పోలీసులు ఎదుర్కొంటున్నారు. వామన్ రావు బాధితుల సంఘం పేరిట ఓ వాట్సప్ గ్రూపు సృష్టించి పోలీసులు, జర్నలిస్టలును సైతం అందులో సభ్యులా చేర్చారు. రామగిరికి చెందిన కీలక నేత ఒకరు ఈ వాట్సాప్ గ్రూపును నడిపించినట్లు తెలుస్తోంది. అందులో వివిధ రకాల అంశాలను పొందుపరిచిన సభ్యులు.. గ్రూపు పేరును హత్యకు ముందు ఒక రకంగా వినియోగించి.. తరువాత మార్పు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: మంథనిలో పాతికేళ్లుగా లీగల్ వార్.. హత్యకు కారణం అదే..

ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం మాత్రమే ఉందని అంతా భావిస్తున్నారు. ఇందుకు బలాన్ని చేకూర్చేలా పుట్టమధు మేనల్లుడు బిట్టు సీనును కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని విచారిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు గుంజపడుగుకు తరలివస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం కూడా కేసు విచారణ వేగవంతం చేశామని చెబుతోంది. ఆదివారం నిందితులను సుందిళ్ల బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు.. హత్యకు వాడిన కత్తులు.. సెల్ ఫోన్లు బ్యారేజీ నీళ్లలోంచి తీసే ప్రయత్నంలో ఉన్నారు.

Also Read: రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌..: విచారణలోకి ఉన్నతాధికారులు

అయితే కేసులో మరో సరికొత్త ట్విస్టు ఏర్పడింది. హత్యకు గురైన గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమాన పరిచాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్రావు చెప్పుకొచ్చాడు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

20 ఏళ్లుగా దుదిళ్ల శ్రీపాదరావు కుటుంబానికి దూరంగా ఉంటున్నానని, నేనేంటో చూపిస్తానని ఆడియోలో మాట్లాడారు. నీవు పోటీ చేస్తే.. నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన భిక్ష అని వామన్ రావు కామెంట్ చేశారు. పుట్టమధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.