https://oktelugu.com/

తమిళనాట మొదలైన సీట్ల పంచాయతీ..

కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకేలు తలపడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్నాడీఎంకేతో ఉన్న పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై సంప్రదింపులు జరుపుతోంది. ఎవరికి ఎన్నీ సీట్లు కేటాయించాలి..? ఎన్ని సీట్లలో పోటీచేయాలి..? అనే విషయంపై బీజేపీ వ్యూహ రచన చేస్తోందట. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ ఛిన్నాబిన్నమైంది. ఈ పార్టీ రెండు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2021 / 04:23 PM IST
    Follow us on

    కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకేలు తలపడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్నాడీఎంకేతో ఉన్న పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై సంప్రదింపులు జరుపుతోంది. ఎవరికి ఎన్నీ సీట్లు కేటాయించాలి..? ఎన్ని సీట్లలో పోటీచేయాలి..? అనే విషయంపై బీజేపీ వ్యూహ రచన చేస్తోందట.

    జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ ఛిన్నాబిన్నమైంది. ఈ పార్టీ రెండు వర్గాలుగా చీలి ఎవరి దారి వారే పడుతున్నారు. తాజాగా శశికళ జైలు నుంచి రావడంతో ఆమె ఏ విధంగా స్పందిస్తారోనన్న చర్చ మొదలైంది. అన్నాడీఎంకే పొత్తులో భాగంగా బీజేపీ 60 సీట్లు అడుగుతోందట. అయితే అన్నీ సీట్లలో బీజేపీ గెలవకపోతే తమ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఎందుకంటే తమిళనాట బీజేపీకి ఇప్పటికీ పట్టు సాధించలేదు. పొత్తులపైనే ఆధారపడుతోంది. అయితే ఇటీవల ఖుష్బులాంటి సెలబ్రీటీలు కాషాయం కండువా కప్పుకోవడంతో బీజేపీకి తగినన్ని సీట్లు వస్తాయనుకుంటోంది.

    మరోవైపు పీఎంకే పార్టీ సైతం ప్రస్తుతం అన్నాడీఎంకే తో కలిసి ఉంది. అయితే సీట్ల సర్దుబాటులో తేడా వస్తే ఆ పార్టీ డీఎంకే కు మారినా ఆశ్చర్యం లేదు. అయితే ఇందులో నుంచి శరత్ కుమార్ బయటకు వచ్చి కమలహాసన్ కు మద్దుత ఇస్తున్నారు. అయితే ఆ పార్టీ 23 సీట్ల కంటే ఎక్కువ కావాలన్నట్లు సూచనలు చేస్తోందట. వన్నియార్లు ఉన్నచోటే ఈ పార్టీ పోటీ చేస్తుండడంతో అన్ని సీట్లలో లాభం చేకూరనుందని భావిస్తోంది.

    డీఎంకేలోనూ సీట్ల పంచాయతీ లేకపోలేదు. కాంగ్రస్ తో పొత్తు పెట్టుకున్నా… వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని డీఎంసీ వ్యూహం రచిస్తోందట. కాంగ్రెస్ కు నామమాత్రపు సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఓ ఫిగర్ ను ఏర్పాటు చేసుకొని అన్ని సీట్లు కచ్చితంగా ఇస్తేనే పొత్తు ఉంటుందని కొందరు నాయకులు చెబుతున్నారట.