https://oktelugu.com/

బ్లాక్ డేకు కేసీఆర్, జగన్, బాబు సహకరించరా?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద పోరాటమే సాగింది. దీనికి పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతు సంఘాలు గళం విప్పాయి. నెలల పాటు రోడ్ల మీద ఆందోళన కొనసాగించాయి. లాక్ డౌన్ ప్రభావంతో ఆందోళనలు సద్దుమణిగినా పోరాట పటిమ ఇంకా నాయకుల్లో రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 26న బ్లాక్ డేగా నిర్వహించాలని తలపించాయి. దీనికి దేశంలోని ఐదుగురు సీఎంలు, పలువురు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 24, 2021 / 09:12 AM IST
    Follow us on

    సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద పోరాటమే సాగింది. దీనికి పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతు సంఘాలు గళం విప్పాయి. నెలల పాటు రోడ్ల మీద ఆందోళన కొనసాగించాయి. లాక్ డౌన్ ప్రభావంతో ఆందోళనలు సద్దుమణిగినా పోరాట పటిమ ఇంకా నాయకుల్లో రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 26న బ్లాక్ డేగా నిర్వహించాలని తలపించాయి. దీనికి దేశంలోని ఐదుగురు సీఎంలు, పలువురు మాజీ సీఎంలు మద్దతు తెలిపారు. దీంతో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఇంకా ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    సాగు చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పడింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన చేసింది. రైతు ఉద్యమం ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బ్లాక్ డే నిర్వహించనున్నట్లు చెప్పింది. దీంతో రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్రంపై పోాటం ఇంకా కొనసాగుతుంది. కేంద్రం దిగి వచ్చి సాగు చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో రైతు సంఘాల మాట కేంద్రం వింటుందా అనేది తేలాల్సి ఉంది. లాక్ డౌన్ రాకపోతే రైతు ఉద్యమం ఇంకా ఉధృతంగానే కొనసాగేది.

    బ్లాక్ డేకు మద్దతు ఇవ్వడంలో కేసీఆర్, జగన్, చంద్రబాబు వెనుకే ఉన్నారు. వారి సంతకాలు లేకపోవడతో వారు మద్దతు తెలపడం లేదనే చెప్పకతప్పదు. రైతు ఉద్యమానికి సహకారం అందిస్తామని చెప్పిన కేసీఆర్ సైతం తన సంతకం చేయలేదు. జగన్, చంద్రబాబుల సంగతి వేరే చెప్పనక్కరలేదు. కేంద్రానికి భయపడే వీరు సంతకాలు చేయలేదని తెలుస్తోంది. వీలు దొరికినప్పుడల్లా బీజేపీని విమర్శించే కేసీఆర్ సైతం భయపడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

    కేంద్రంతో ఎప్పటికైనా అవసరం పడుతుందనే నెపంతోనే బ్లాక్ డే లేఖపై సంతకాలు చేయడానికి కేసీఆర్, బాబు, జగన్ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే బాబు బీజేపీ దోస్తీతో ఓసారి అధికారం చేపట్టారు. జగన్ కు కేసుల భయం ఎలాగూ ఉంది. ఇక కేసీఆర్ సైతం అప్పుడప్పుడు కేంద్రంతో సఖ్యత ప్రదర్శించి పనులు చక్కబెట్టుకుంటుంటారు. అందుకే రైతు ఉద్యమానికి నేతలు సహకరించడం లేదని పలువురి వాదన.