తెలుగు తమ్ముళ్లలో హుషారు పెరిగింది. ప్రభుత్వం మీద సవాల్ చేసేందుకు సమస్యలు కోకొల్లలుగా దొరుకుతున్నాయి. దీంతో జగన్ ను ఇరకాటంలో పెట్టి ఎలాగైనా అధికారం కొట్టేయాలన పావులు కదుపుతున్నారు. ఇందులో గంగా అరెస్టుల పర్వం కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.ఇవేమీ తెలియని వైసీపీ నేతలు టీడీపీ నేతల అరెస్టుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో చంద్రబాబు, చినబాబు ఏమైనా చేసుకోండని వారిపై కాలు దువ్వుతున్నారు. ఎలాగైనా కవ్వించి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ వారిని అరెస్టు చేస్తే టీడీపీకే ప్రయోజనం కలుగుతుంది. ఇవేమీ తెలియని వైసీపీ నేతలు వారి ఉచ్చుకు బలవుతున్నారు. కర్నూలులో చంద్రబాబు, చినబాబు లమీద కేసులు పెట్టారు. దీనికి ముందు టీడీపీ నేతలు వరుసగా అరెస్టు అవుతున్నారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మా మీద ఈ రోజు జరుగుతున్న రాజకీయ దాడులు రేపు మీ వరకు వస్తాయని, ఇప్పుడు అదే జరిగేలా ఉంది. ప్రజాదరణ కోల్పోతున్న పార్టీకి ప్రస్తుతం అరెస్టులే ఆదరణ.
దీంతోనే జనంలో సింపతీ పెరిగి ఓటు బ్యాంకు కూడా పెరుగుతుంది. అందుకే నేతలు తమ అరెస్టులకు భయపడకుండా ముందుకు వెళ్తున్నారు. అరెస్టులు చేసుకో జగన్ అంటూ బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు. ఎలాగైనా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టి తమ ప్రయోజనాలు సాధించుకోవడమే టీడీపీ లక్ష్యం.
కేసులతోనే దూసుకు రావాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ
నేతలను కవ్విస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇవేమీ తెలియని వైసీపీ నేతలు సైతం అంతే స్థాయిలో రెచ్చిపోతూ దొరికిపోతున్నారు. కేసుల వరకు వెళ్తూ ప్రతిపక్షానికి దారులు తెరుస్తున్నారు. ప్రతిపక్షం చేస్తున్న పనులు పట్టించుకోకుండా వారిని ఇరుకున పెడతామని ఆలోచస్తూ వీరే సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. వారు మంచిగా తమ ప్రయోజనాలు సాధించుకుంటున్నారు. అయ్యో పాపం అని జనం అనుకునేలా ప్రవర్తిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.
టీడీపీకి మీడియా సహకారం కూడా తోడవుతోంది. దీంతో జగన్ సర్కారు మీద చిందులు తొక్కుతోంది. మీడియాను కంట్రోల్ చేసే పనిలో భాగంగా ప్రభుత్వం కూడా దొరికిపోతోంది. ఇటీవల రఘురామ కేసులో మీడియాపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయ. దీంతో ఏం చేయాలో సర్కారుకు పాలుపోవడం లేదు. ఏది ఏమైనా టీడీపీ నాయకులు వైసీపీని ఇరుకున పెట్టే పనిలో భాగంగా తమకున్న అన్ని దారులు వెతుక్కుంటున్నారు.