Homeజాతీయ వార్తలుLoco pilot denied sick leave: ఫైల్స్ ఉన్నాయన్నా వినలేదు. రైలు నడిపించమన్నారు.. మీరు మనుషులు...

Loco pilot denied sick leave: ఫైల్స్ ఉన్నాయన్నా వినలేదు. రైలు నడిపించమన్నారు.. మీరు మనుషులు కాదు రా బాబూ

Loco pilot denied sick leave: అది లక్నో రైల్వే డివిజన్. అందులో ఒక లోకో పైలట్ పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు అనారోగ్యానికి గురయ్యాడు. సెలవు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితి వివరిస్తూ సెలవు మంజూరు చేయాలని ఉన్నతాధికారిని కోరాడు. కానీ అతడి నుంచి వచ్చిన సమాధానం చూసి షాక్ అయ్యాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో రైల్వే డివిజన్లో రాజేష్ అనే వ్యక్తి లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్లి చూపించుకోగా అతడికి పైల్స్ వచ్చాయని తేలింది. అతడు బహిర్భూమికి వెళ్తుండగా విపరీతమైన నొప్పి వస్తోంది. రక్త స్రావం కూడా అధికంగా జరుగుతుంది. దీంతో తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నాడు. ఇటీవల వైద్యుడిని సంప్రదిస్తే సర్జరీ చేస్తానని చెప్పాడు. పైల్స్ కు సర్జరీ చేస్తే కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

సర్జరీ చేయించుకునే క్రమంలో తనకు విశ్రాంతి కావాలని.. దానికోసం సెలవులు మంజూరు చేయాలని రాజేష్ తన ఉన్నతాధికారికి చెప్పాడు. అయితే రాజేష్ చెప్పిన మాటలను ఉన్నతాధికారి పట్టించుకోలేదు. దీంతో రాజేష్ తన హెల్త్ రికార్డులను ఆయన ముందు పెట్టాడు. అయినప్పటికీ ఆ అధికారి మనసు కరగలేదు. చివరికి తన ప్యాంటు విప్పి.. తనకు ఫైల్స్ అయిన విధానాన్ని చూపించాడు .. అయినప్పటికీ ఆ అధికారి సెలవు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. యూనియన్ నేతలతో కూడా చెప్పాడు.

Also Read: ఇండియాకు మోడీ బలం.. ఇరాన్ పై యుద్ధానికి అదే లోపం

యూనియన్ నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఉన్నతాధికారులు యూనియన్ నేతల ఒత్తిడికి తలవంచారు. చివరికి రాజేష్ కు సెలవు మంజూరు చేశారు. అతడు త్వరలోనే శస్త్ర చికిత్స చేసుకుంటాడని తెలుస్తోంది. సెలవు కోసం తన పైల్స్ చూపించినప్పటికీ ఆ అధికారి మనసు కరగకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version