Bandi Sanjay: 2019 ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆయన పేరు ఎవరీకీ పెద్దగా తెలియదు. కానీ అనూహ్యంగా ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత పార్టీ పగ్గాలు తీసుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ఉమ్మడి జిల్లాలోనే ఆయన ఎవరికీ తెలియని ఆయన పేరు.. ఇప్పుడు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇప్పటికే ఆయన ఎవరో మీకు గుర్తుకొచ్చే ఉంటుంది. ఆయనే నండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేటర్ గా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. వరుసగా రెండుసార్లు కరీంనగర్ 48వ డివిజన్‌నుంచి పోటీ చేసి గెలుపొందారు. చిన్నప్పటి నుంచే ఆర్ ఎస్ ఎస్‌లో పనిచేసిన సంజయ్.. బీజేపీ సిద్ధాంతాలను అనువణువునా నింపుకున్నారు. మొదటి నుంచి అదే పార్టీలో ఉండి ఎన్నో పార్టీ పదవులను స్వీకరించారు.
Also Read: CM Jagan- Kamma Community: కులాల కుంపటిలో చలి మంట.. యాంటీ కమ్మ స్టాండ్ జగన్ కు కలిసొచ్చేనా?
ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు బండికి 52,000ఓట్లు వచ్చాయి. ఇక 2018లో మరోసారి పోటీ చేసి గంగుల చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకానొక సమయంలో గంగులను అధిగమించారు కూడా. కానీ చివరకు గంగులదే పై చేయి అయింది. ఈ ఎన్నికల్లో ఆయనకు 66009 ఓట్లు వచ్చాయి. రెండు సార్లు ఓడిపోయినా కుంగిపోకుండా.. 2019 ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు.
అయితే ఆ సమయంలో మోడీ వేవ్ బలంగా ఉండటంతో పాటు కొన్ని సైద్దాంతిక పరిణామాలు సంజయ్ కు కలిసి వచ్చాయి. ముఖ్యంగా కేసీఆర్ కరీంనగర్ లో చేసిన కామెంట్లు బాగా ప్లస్ అయ్యాయి. హిందు గాళ్లు.. బొందు గాళ్లు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లను బండి సంజయ్ బాగా వాడుకున్నారు. హిందువులను అవమానిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
హిందువులను అవమానించిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తనను గెలిపించి బుద్ధి చెప్పాలంటూ ప్రచారం చేయించారు. అది యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. పైగా సంజయ్ సోషల్ మీడియాను విరివిగా వాడుకున్నారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు బలంగా క్షేత్ర స్థాయిలో సంజయ్ కోసం పనిచేయడంతో ఒకింత పాజిటివ్ వేవ్ కనిపించింది.
దాంతో ఆయన వినోద్ కుమార్ పై 96వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎంపీ అయ్యారు. ఇక ఆ తర్వత బీజేపీ పగ్గాలు తీసుకుని పార్టీని పరుగులు పెట్టించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో సంజయ్ దిట్ట. అదే యూత్‌కు ఆయన్ను దగ్గర చేసింది. తన ప్రసంగంలో ఫైర్ ను చూపించి నిత్యం కేసీఆర్ మీద మాటల యుద్ధం చేశారు.
వరుస ఎన్నికల్లో కొంత ప్రభావం కూడా చూపించారు. జీహెచ్ ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ లాంటి కీలక ఎన్నికల్లో బీజేపీని పై స్థానంలో ఉంచారు. దాంతో కేంద్ర నాయకత్వానికి ఆయన నమ్మకస్తుడిగా మారిపోయారు. పార్టీలో సంజయ్‌దే తుది నిర్ణయం అయిపోయింది. దాంతో ఆయన కరీంనగర్ లోని తన పార్లమెంట్ నియోజకవర్గంలో కంటే కూడా పార్టీ పరంగా చాలా బిజీ అయిపోయారు.
మొదటి సారి గెలిచిన ఏ రాజకీయ నేత అయినా మరోసారి గెలవాలంటే తన మార్కును చూపించాలి. అప్పుడే ఆయన మీద అంచనాలు ఏర్పడుతాయి. కానీ బండి సంజయ్ విషయంలో మాత్రం ఇది జరగలేదు. ఆయన ఎంత సేపు పార్టీ పనుల్లో, ఇతర విషయాల్లోనే బిజీగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. దాంతో సొంత సెగ్మెంట్ లో ఆయన ప్రజలకు దూరం అయిపోయారు.
కరీంనగర్ ఎమ్మెల్యే కావాల్నది సంజయ్ ఆశయం. మరి దాని కోసం నిత్యం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తేనే ప్రజలకు చేరువయ్యేది. పైగా ఎంపీగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి ఏమైనా ప్రత్యేక నిధులు తీసుకు వెళ్లారా అంటే అదీ లేదు. ఎంత సేపూ హిందూత్వ భావజాల మాటలు తప్ప అభివృద్ధి పనులు మాత్రం సంజయ్ హయాంలో పెద్దగా జరగట్లేదు.
ఇంకోవైపు కమలాకర్ మంత్రిగా తన నియోజకవర్గంపై తన ముద్ర బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. మరోసారి సంజయ్ తన మీద పోటీ చేస్తారని గంగులకు తెలుసు. అందుకే ఇప్పటి నుంచే తన పట్టును బలంగా బిగిస్తున్నారు. కేటీఆర్ అండ గంగులకు సమృద్ధిగా ఉంది. దాంతో ఆయన మరిన్ని పనులు చేయిస్తూ తన పేరు మార్మోగేలా చేసుకుంటున్నారు.
మొదటి నుంచి బండి సంజయ్ బలం యూత్ మాత్రమే. రైతుల్లో గానీ, మహిళల్లో గానీ ఆయన మీద అభిమానం లేదు. ఆయన చేస్తాడన్న నమ్మకం కూడా పెద్దగా లేదు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్లతో యూత్ కూడా సంజయ్‌తో గ్యాప్ మెయింటేన్ చేస్తోంది. ఇంతకు ముందులాగా సోషల్ మీడియాలో పని గట్టుకుని సంజయ్‌ను ప్రమోట్ చేయట్లేదు. ప్రిపరేషన్ బిజీలో పడిపోయింది యూత్ మొత్తం.
అంతెందుకు బీజేపీ కార్యకర్తలు కూడా జాబ్ ప్రిపరేషన్‌లో ఉంది. ఏ వర్గంలో కూడా పెద్దగా పట్టు సాధించలేకపోయిన సంజయ్ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు. రైతులు, పింఛన్ దారులు, మహిళలు మొత్తం టీఆర్ ఎస్‌వైపు ఉన్నారు. ఇన్ని రోజులు అసంతృప్తిలో ఉన్న యూత్ బీజేపీ వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్ దెబ్బకు వారు కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
పార్టీ పరంగా పనుల్లో మునిగిపోయిన సంజయ్.. నియోజకవర్గంలో మాత్రం పట్టు పెంచుకోలేకపోయారు. అదే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. మరోసారి గెలవాలంటే మాత్రం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున అభివృద్ధి నినాదం ఎత్తుకోవాలి. అంతే గానీ.. ఒక వర్గాన్ని నమ్ముకుంటే మాత్రం గెలిచే పరిస్థితులు లేవు.
Also Read: Central/State Governments: కేంద్రంతో రాష్ట్రాలు ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి?