Pooja Hegde: ‘పూజా హెగ్డే’కి ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. ‘రంగస్థలం’ సినిమాలో పూజా ‘జిగేల్ రాణి’ అంటూ ఓ ఐటమ్ పాట చేసింది. అయితే, ఆ సినిమా తర్వాత ‘పూజా హెగ్డే’ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో డబుల్ అయ్యింది. దాంతో.. అమ్మడు ఇక మళ్లీ ఐటమ్ పాటల జోలికి పోలేదు. కానీ.. ప్రస్తుతం ‘పూజా హెగ్డే’.. ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది.

నిజానికి ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ లేదు. పూజా క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు ఆమెను ఈ సాంగ్ చేయడానికి ఒప్పించాడు. కారణం.. ‘ఎఫ్ 3’ సినిమా డబ్బింగ్ వెర్షన్ కి హిందీలో గిరాకీ పెరగాలంటే.. పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ చేత ఒక సాంగ్ చేయించాలి. పూజా కూడా ఈ ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించింది.
Also Read: Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కోర్టు శిక్ష విధిస్తుందా?
మొదట్లో నో చెప్పినా.. ఒక రోజులో పాటను పూర్తి చేస్తాం అని.. ఇక ఒక్క రోజు షూట్ కోసం పూజా హెగ్డేకి దాదాపు రూ. 1 కోటి పారితోషికం ఇస్తాం అని దిల్ రాజు భారీ ఆఫర్ ఇచ్చాడు. వెంటనే.. పూజా ఓకే చెప్పేసింది. ఈ పాట సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. పైగా దిల్ రాజుకి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు.
ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ సినిమాలో అదిరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయిస్తున్నాడు. ఎలాగూ.. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అనగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పైగా ఈ సినిమాలో కామెడీ.. హీరోల పాత్రల్లో నుండి మాత్రమే పుట్టుకొస్తోందట. అంత పర్ఫెక్ట్ గా అనిల్ ఈ సినిమాలో పాత్రలను డిజైన్ చేశాడు.

ఇంతకీ సినిమాలో హీరోల పాత్రల విషయానికి వస్తే.. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్, నత్తితో నానాపాట్లు పడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారని.. వీరి లోపాలు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయని తెలుస్తోంది.
అదే విధంగా ఎఫ్ 2లోని వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని.. ఈ సీక్వెల్ లోనూ తమన్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి కథ పై క్లూ ఇచ్చాడు.
Also Read:KGF Chapter 2: ‘కేజీఎఫ్ 2’కు తెలంగాణ వరం.. కారణం ఆయనే !