https://oktelugu.com/

Ram Charan: చరణ్.. ఈ రోజు ఫైటింగ్, రేపటి నుంచి రొమాన్స్

Ram Charan: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ మనసు పెట్టి.. మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ షూటింగ్ మొన్న పంజాబ్‌ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమృతసర్‌‌ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటిలో శరవేగంగా జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన […]

Written By:
  • Shiva
  • , Updated On : April 12, 2022 / 05:37 PM IST
    Follow us on

    Ram Charan: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ మనసు పెట్టి.. మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ షూటింగ్ మొన్న పంజాబ్‌ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

    Ram Charan

    అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమృతసర్‌‌ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటిలో శరవేగంగా జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌ లో ఈ రోజు రామ్‌ చరణ్‌ పై ఫైటింగ్ సీన్స్‌ ను చిత్రీకరిస్తున్నారు. రేపటి నుంచి కియారా అద్వానీ – రామ్‌ చరణ్‌ ల పై కొన్ని ప్రేమ సన్నివేశాలను షూట్ చేస్తారట.

    Also Read: Ashoka Vanam lo Arjuna Kalyanam: ‘అర్జున క‌ళ్యాణం’ ఈ సారైనా జరుగుతుందా ?

    రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం చెర్రీ కొడుకు పాత్రకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం వరకూ ఈ సినిమా షెడ్యూల్ జరగనుంది.

    అనంతరం చరణ్ ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. ఇక ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. ఎలాగూ ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది.

    Ram Charan

    వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు. అన్నిటికి మించి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. అందుకే ఈ భారీ పాన్ ఇండియా పొలిటికల్ సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పని చేస్తున్నాడు.

    Also Read: KGF Chapter 2: ‘కేజీఎఫ్ 2’కు తెలంగాణ వరం.. కారణం ఆయనే !

    Tags